Bigg Boss Telugu 9: ఆ ఒక్కరు తప్ప అందరూ డేంజర్ జోన్‌లోనే.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 12వ వారం నామినేషన్స్ కాస్తా డిఫరెంట్ గా జరిగాయి. తొలిసారిగా రెండు దశల్లో నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా ఏకంగా ఎనిమిది మంది డేంజర్ జోన్ లో నిలిచారు. అంటే ఒక్కరు తప్ప మిగతా అందరూ ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చేసినట్టే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 12వ వారంలోకి అడుగు పెట్టింది. అంటే ఇక మూడు వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. కాగా గత వారం బిగ్ బాస్ హౌస్ లో అంతా ఫ్యామిలీ వీక్ సాగింది. వీకెండ్స్‌లో కంటెస్టెంట్స్‌కు రిలేటివ్స్, సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే..గత వారం ఎలిమినేషన్ జరగలేదు. సంజన, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ సేవ్ అయ్యారు. ఇక పన్నెండో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి సోమవారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అయితే ఈసారి చాలా డిఫరెంట్ గా నామినేషన్స్ ప్రక్రియను ప్లాన్ చేశారు. ఒకటి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ప్రైవేట్‌గా, మరొకటి అందరి ముందు ఓపెన్‌గా కారణాలు చెప్పి నామినేట్ చేయడం. అయితే రెండు పద్దతుల్లో నామినేషన్స్ జరిగినా ఈ ప్రక్రియ ఎప్పటిలాగే ఒక మినీ యుద్దాన్ని తలపించింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఏకంగా 8 మంది నామినేషన్స్ లో నిలవడం గమనార్హం.
తనూజ, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన, దివ్య నికితా, భరణి 12 వారం నామినేషన్స్ లో నిలిచారు. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కెప్టెన్ అయిన కారణంగా బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది. కాగా ప్రస్తుతం ఈ ఎనిమిది మందిలో సంజన, దివ్యలే డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం. ఎందుకంటే గత వారం వీరిద్దరికే తక్కువ ఓట్లు పడ్డాయి. దాదాపు ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే అదృష్టం కొద్దీ ఇద్దరూ సేవ్ అయ్యారు. అయితే ఈ వారం మాత్రం అలాంటి పరిస్థితి ఉండబోదని తెలుస్తోంది. దివ్య నికితా హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయంది కాబట్టి ఆమె సేవ్ అయ్యే ఛాన్సుంది కానీ.. సంజన మాత్రం బ్యాగ్ సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో…
It’s verbal war mode in the house, HIGH TENSION Loading…🚨💥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/K8opl1uYPd
— Starmaa (@StarMaa) November 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








