Bigg Boss 9 Telugu : డీమాన్, రీతూపై సంజన సంచలన కామెంట్స్.. ఫైర్ అయిన ఇమ్మాన్యూయేల్.. అంత మాట అనేసిందేంటీ..
బిగ్ బాస్ సీజన్ 9.. ఆట తక్కువ రచ్చ ఎక్కువ అన్నట్లుగా సాగుతుంది. టాస్కుల విషయం పక్కనపెడితే ఎవరో ఒకరు పర్సనల్ అటాక్ చేసుకుంటునే ఉన్నారు. మొన్నటి వరకు భరణి విషయంలో దివ్య, తనూజ కొట్టుకున్నంత పనిచేశారు. ఇక ఇప్పుడు సోమవారం నామినేషన్లలో రీతూ, డీమాన్ పై సంచలన కామెంట్స్ చేసింది సంజన. దీంతో ఆమె మాట సరైంది కాదంటూ ఇమ్మూ ఫైర్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 9.. తుది అంకానికి చేరుకుంది. మొన్నటి వరకు ఫ్యామిలీ వీక్ తో హౌస్ లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. ఇక హౌస్ లోనే కాకుండా వీకెండ్ లో స్టే్జ్ పై కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇప్పుడు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ ఫోటోను ఫైర్ చేయాల్సి ఉంటుంది. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం బ్లాస్ట్ అయ్యింది. సంజనను రీతూ నామినేట్ చేయగా.. ఇద్దరి మధ్య వాగ్వదం నెలకొంది. దీంతో రీతూ, డీమాన్ పై సంజన సంచలన కామెంట్స్ చేసింది. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం విడుదలైన ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్ధాం.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ముందుగా డీమాన్ వచ్చి ఇమ్మాన్యుయేల్ ను నామినేట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. అదే సమయంలో కళ్యాణ్, రీతూ, డీమాన్, ఇమ్మాన్యూయేల్ మధ్య పెద్ద గొడవే జరిగింది. డీమాన్ గేమ్ ఆడడం లేదంటూ రీతూ పై ఫైర్ అయ్యాడు కళ్యాణ్. నిజానికి చెప్పాలంటే.. సీజన్ 9 మొత్తంలో మొదటిసారి ఈ రేంజ్ ఫైట్స్ జరిగాయి. ఇక తర్వాత తనూజ.. దివ్యను నామినేట్ చేస్తూ.. ఒక పర్సన్ వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇక్కడితో ఆపేద్ధామని చెప్పింది తనూజ. దీంతో ఇద్దరు హగ్ చేసుకుని కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత రీతూ వచ్చి సంజనను నామినేట్ తన వెర్షన్ చెప్పింది. మీ గేమ్ కనిపించడం లేదంటూ రీతూ చెప్పడంతో సంజన సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే రీతూపై నోరు జారింది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఆట ఆడాను కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను.. అసలు నీలా నేను ఇంట్లో బూతులు కూడా మాట్లాడను.. నువ్వు రాత్రంత వెళ్లి డీమాన్ పక్కన కూర్చుంటావంటూ రీతూపై నోరు జారింది. ఆమె మాటలకు హౌస్ మొత్తం షాకయ్యింది. కళ్లు మూసుకునేంత నేనేం చేశాను బిగ్ బాస్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రీతూ. దీంతో ఇమ్మూ సంజనపై సీరియస్ అయ్యాడు. మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు.. వెనక్కి తీసుకో ఆ మాట అంటూ గట్టిగానే అరిచి చెప్పాడు. కానీ సంజన మాత్రం ససేమిరా అంటూ వెళ్లిపోయింది. మొత్తానికి ఈవారం నామినేషన్స్ మాత్రం రచ్చ రచ్చగానే సాగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..




