Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
దాదాపు ఆరేళ్ల క్రితం విడుదలైన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సినీప్రియులను ఆకట్టుకుంది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి అప్పట్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిన్న బడ్జెట్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఏ సినిమా అంటే..

దాదాపు ఆరేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా. ఎలాంటి అంచనాలు హడావిడి లేకుండా విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా 2018లో విడుదలైన ఈ సినిమాను కేవలం రూ.32 కోట్లతో నిర్మించారు. ఆ తర్వాత ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టైంది. క్లైమాక్స్, కొత్త కంటెంట్ జనాలను విపరీతంగా ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. దీంతో ఆరేళ్ల తర్వాత ఈ మూవీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసా.. ? ఆ మూవీ పేరు అంధాధున్..
ఊహించని ట్విస్టులు, మలుపులతో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, అనిల్ ధావన్, టబు, రాధిక ఆప్టే కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా అంధుడైన పియానో ప్లేయర్. తన స్నేహితురాలు రాధికా ఆప్టే రెస్టారెంట్ లో పియానో వాయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు ధనవంతులు కావడానికి అనిల్ ధావన్ ను పెళ్లి చేసుకుంటుంది టబు. ఆ తర్వాత హఠాత్తుగా అనిల్ ధావన్ మరణించడం.. ఆ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఆయుష్మాన్ ఖురానా పై వస్తాయి.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
తనపై వచ్చిన విమర్శలను ఆయుష్మాన్ ఎలా ఎదుర్కొన్నాడు.. ? అసలు అనిల్ ధావన్ ను ఎవరు హత్య చేశారు? చివరకు హంతకుడు దొరికాడా లేదా ? అనేది సినిమా. కేవలం 32 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.440 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
