Bigg Boss 9 Telugu : హౌస్లో పెట్టిన పూలతో దేవుళ్లందరికీ దండేసేయొచ్చు.. తనూజకు మర్యాద మనీష్ మాస్ కౌంటర్..
బిగ్‌బాస్ సీజన్ 9.. మొదటి నుంచి విన్నర్ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనూజ గౌడ. నిజానికి టాస్కులలో తనూజ ఇరగదీసింది ఏమీ లేదు.. కేవలం పీఆర్ టీమ్, సీరియల్ ఫ్యాన్స్ కారణం.. మరోవైపు బిగ్ బాస్ సపోర్ట్.. దీంతో ఆమె విన్నర్ రేసులో దూసుకుపోతుంది. నిజానికి హౌస్ లో ఎవరు తప్పు చేసిన హోస్ట్ నిలబెట్టి మరీ కడిగిపారేస్తారు. కానీ తనూజ తప్పు చేస్తే మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తారని నెటిజన్స్ మండిపడుతున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. మరికొన్ని వారాల్లో ముగియనుంది. ఈ క్రమంలో తనూజ పేరు విన్నర్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆమె పేరు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు టైటిల్ రేసులో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ పేర్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. నిజానికి ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, భరణి, డీమాన్ వంటి కంటెస్టెంట్స్ టాస్కులలో అదరగొట్టేస్తున్నారు. కానీ ఇప్పటివరకు తనూజ టాస్కులలో అంతగా ఆడింది ఏమి లేదు. కేవలం ఆమెకు సంబంధించిన ప్రతి పాజిటివ్ విషయాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్న బిగ్ బాస్.. తప్పులను మాత్రం కప్పేస్తున్నారని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. అలాగే ఆమెకు స్క్రీన్ ఫుటేజ్ ఎక్కువగా ఇవ్వడం..అటు బయట పీఆర్ టీం గట్టిగానే కష్టపడడం చూస్తుంటే కావాలని ఆమెను విన్నర్ చేయాలని చూస్తున్నరని అంటున్నారు. మరోవైపు అదే స్థాయిలో తనూజపై నెగిటివిటీ వస్తుంది. ముఖ్యంగా హౌస్మేట్స్ పట్ల తనూజ మాట, ప్రవర్తన చూస్తుంటే అడియన్స్ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఫ్యామిలీ వీక్ లో ముద్ద మందారం టీమ్ హరిత, పవన్ సాయి బిగ్‌బాస్ స్టేజ్ మీదుకు తనూజ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లను చూసిన తనూజ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికే నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. మరోవైపు తనూజపై మర్యాద మనీష్ చేసిన చెవిలో మందార పూలు కామెంట్ కు హరిత కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆదివారం ఎపిసోడ్ లో హరిత మాట్లాడుతూ.. చాలా మంది మర్యాద పురుషులు ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందని నీ గురించి అన్నారు. కానీ మందార పువ్వు ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనందరి జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. ఆ పువ్వు ఎప్పుడూ అందంగా వికసిస్తూనే ఉండాలి. మనం చుట్టూ చాలా మంది మన చెవిలో పువ్వులు పెట్టడానికి ఉంటారు. కానీ ప్రతి పువ్వును కలెక్ట్ చేసి మాల కట్టి ఆ భగవంతుడికి సమర్పించాలి. నీ టార్గెట్ అదే అంటూ ఇన్ డైరెక్ట్ గా మర్యాద మనీష్ కు కౌంటరిచ్చంది హరిత. ఇక ఆమె కామెంట్స్ పై మరోసారి రియాక్ట్ అవుతూ.. ఈసారి గట్టిగానే రియాక్ట్ అయ్యాడు మనీష్.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
“హౌస్ లో పెట్టిన మందార పూలన్నీ ఈ తోటలో నుంచే అన్నమాట.. పెట్టిన పూలతో ఒక దేవుడు ఏంటీ ఇండియాలో ఉన్న దేవుళ్లు అందరికీ దండలు వేసేయొచ్చు ” అంటూ గంగోత్రి సినిమాలోని ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పూవు పూసింది.. పాటకు సంబంధించిన వీడియో క్లిప్ షేర్ చేస్తూ అందులో ముద్ద మందారం ఎమోజీ షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
House lo pettina mandara poolu anni ee Thota lo nunche anamata 😂 Pettina poolatho okka devudu enti India lo unna Devudlu andarki dandalu veseyochu! 😘🌺🌺#BiggBossTelugu9 pic.twitter.com/PLCGAACIvH
— Maryada Manish (@maryadamanishi) November 23, 2025
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
