Tollywood: ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె భర్త ఫేమస్ హీరో.. ఫోటోస్ వైరల్..

అందులో హీరోయిన్ డెబీనా బెనర్జీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ప్రేక్షకులు ఈ పేరు వినలేదు. కానీ 'అమ్మాయిలు అబ్బాయిలు' మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన అమాయకత్వంతో కట్టిపడేసింది డెబీనా. డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి విజయం అందుకుంది.

Tollywood: 'అమ్మాయిలు అబ్బాయిలు' మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె భర్త ఫేమస్ హీరో.. ఫోటోస్ వైరల్..
Ammailu Abbailu
Follow us

|

Updated on: Oct 15, 2024 | 11:07 AM

తొలి సినిమాతోనే సినీ ప్రియులను ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ జనాలు మెచ్చిన కొందరు హీరోయిన్స్ అనుహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఆకట్టుకున్న తారలు.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ఒకట్రెండు చిత్రాలు చేసి సినీరంగానికి పూర్తిగా దూరమయ్యారు. అందులో హీరోయిన్ డెబీనా బెనర్జీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ప్రేక్షకులు ఈ పేరు వినలేదు. కానీ ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన అమాయకత్వంతో కట్టిపడేసింది డెబీనా. డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలో మోహిత్, విజయ్ సాయి, డెబీనా ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే సోనూ సూద్, రమ్య శ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన డెబీనా తొలి చిత్రానికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒకప్పుడు అందం, అమాయకత్వం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. డెబీనా కలకత్తాలోని వెస్ట్ బెంగాల్ అమ్మాయి.. 2003లో ఇండియన్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో నటించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ సరసన ఓమూవీ చేసింది.

డెబీనాకు సౌత్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యింది. దాదాపు పదేళ్ల తర్వాత జగపతి బాబు నటించిన సిక్స్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. వెండితెరకు దూరమైనా ఈ అమ్మడు తమిళ్, హిందీ టీవీ సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే.. డెబీనా భర్త కూడా నటుడే. అతడికి బుల్లితెరపై చాలా ఫాలోయింగ్ ఉంది. డెబీనా భర్త పేరు గుర్మీత్ చౌదరి. 2011లో వీరిద్దరి వివాహం జరగ్గా వీరికి ఇద్దరు అమ్మాయిలు. తాజాగా సోషల్ మీడియాలో డెబీనా ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇక్కడ చదవండి: ప్రాణమిచ్చే ఫ్యాన్స్.. పేరు చెబితే పూనకాలే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'అమ్మాయిలు అబ్బాయిలు' మూవీ హీరోయిన్ గుర్తుందా ?..
'అమ్మాయిలు అబ్బాయిలు' మూవీ హీరోయిన్ గుర్తుందా ?..
ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై-అలెర్ట్
ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై-అలెర్ట్
రాత్రి భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.? ఊబకాయం తప్పదు
రాత్రి భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.? ఊబకాయం తప్పదు
చోరీ చేసిన స్కార్పియో రాజస్థాన్‌లో వదిలేసిన దొంగలు.. క్షమించాలంటూ
చోరీ చేసిన స్కార్పియో రాజస్థాన్‌లో వదిలేసిన దొంగలు.. క్షమించాలంటూ
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ట్రూడో!
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ట్రూడో!
దేశం తరపున ప్రపంచకప్ ఆడని ఐదుగురు బ్యాడ్ లక్ ప్లేయర్లు
దేశం తరపున ప్రపంచకప్ ఆడని ఐదుగురు బ్యాడ్ లక్ ప్లేయర్లు
పెటా దెబ్బకు దిగొచ్చిన బిగ్‏బాస్.. గాడిద ఎలిమినేట్..
పెటా దెబ్బకు దిగొచ్చిన బిగ్‏బాస్.. గాడిద ఎలిమినేట్..
కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో
కల్తీ పసుపు కొమ్ములను ఎలా గుర్తించాలో తెలుసా.? సింపుల్‌ టెస్ట్‌తో
ఢిల్లీ రిటైన్ చేయనున్న ఆరుగురు ఆటగాళ్లు.. ఆ ప్లేయర్‌కు వీడ్కోలు?
ఢిల్లీ రిటైన్ చేయనున్న ఆరుగురు ఆటగాళ్లు.. ఆ ప్లేయర్‌కు వీడ్కోలు?
రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు
రూ.20వేలతో బైక్‌..రూ.60వేలతో బరాత్‌.. అంతలోనే షాకిచ్చిన పోలీసులు