అనగనగా ఒక రాజుతో మరో హిట్టు.. మీనాక్షి చౌదరి రెమ్యునరేషన్ ఏంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
14 January 2026
సంక్రాంతి పండగ కానుకగా అనగనగా ఒక రాజు సినిమాతో మరో హిట్టు అందుకుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో.
గత కొంతకాలంగా వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్టు కొట్టింది.
గతంలో ఆమె ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకునేది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల తర్వాత రూ. 5 కోట్లు తీసుకుంటుంది.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఆమెకు 50 నుండి 60 లక్షల రూపాయలు తీసుకుంటుంది. హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది.
2021లో విడుదలైన 'ఇచట వాహనములు నిలుపరడు' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకు హిట్ 2 సినిమాతో మరో హిట్ అందుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ రావడంతోపాటు విజయాలను అందుకుంది.
గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇప్పుడు ఆమె పారితోషికం రూ.5 కోట్లు.
అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఈ అమ్మడు నటించిన అనగనగా ఒకరాజు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్