Bigg Boss : పెటా దెబ్బకు దిగొచ్చిన బిగ్‏బాస్.. ఎట్టకేలకు హౌస్ నుంచి గాడిద ఎలిమినేట్..

ఎప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ఈ షోపై వివాదాలు నెలకొంటాయి. కానీ ఇప్పుడు కంటెస్టెంట్‌గా గాడిదను తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. కంటెస్టెంట్‏గా గాడిదను పంపించడమేంటని జనాలు బిగ్‏బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. ఇక షో నుంచి గాడిదను తొలగించాలని కోరుతూ ‘పెటా ఇండియా’ బిగ్‌బాస్‌ యాజమాన్యానికి లేఖ రాసింది. మీ వినోదం కోసం మూగ జీవిని ఉపయోగిస్తారా ? అంటూ పెటా మండిపడింది.

Bigg Boss : పెటా దెబ్బకు దిగొచ్చిన బిగ్‏బాస్.. ఎట్టకేలకు హౌస్ నుంచి గాడిద ఎలిమినేట్..
Bigg Boss
Follow us

|

Updated on: Oct 15, 2024 | 10:47 AM

బుల్లితెరపై ఎంతో ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఇప్పుడు అన్ని భాషలలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళం, హిందీలో ఈ షో రన్ అవుతుంది. తెలుగులో సీజన్ 8 నడుస్తుండగా.. ప్రస్తుతం హిందీలో 18వ సీజన్ ప్రసారమవుతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తోన్న ఈషో కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. ఎప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ఈ షోపై వివాదాలు నెలకొంటాయి. కానీ ఇప్పుడు కంటెస్టెంట్‌గా గాడిదను తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. కంటెస్టెంట్‏గా గాడిదను పంపించడమేంటని జనాలు బిగ్‏బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. ఇక షో నుంచి గాడిదను తొలగించాలని కోరుతూ ‘పెటా ఇండియా’ బిగ్‌బాస్‌ యాజమాన్యానికి లేఖ రాసింది. మీ వినోదం కోసం మూగ జీవిని ఉపయోగిస్తారా ? అంటూ పెటా మండిపడింది. దీనిపై తాజాగా యాజమాన్యం స్పందించింది. బిగ్‌బాస్‌ టీమ్ గాడిదను విడుదల చేసినట్లు ఇన్‌స్టా వేదికగా యాజమాన్యం తెలిపింది. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్నందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పింది. అందరి సమష్టి కృషి వల్లే ఈ షో ఇంత విజయవంతంగా సాగుతుందని టీమ్ తెలిపింది.

అక్టోబర్‌ 6న హిందీలో బిగ్‌బాస్‌ 18వ సీజన్‌ ప్రారంభమైంది . ఇందులో కంటెస్టెంట్‌గా గాడిదను హౌజ్‌లోకి పంపారు. దీంతో పెటా ఇండియా బిగ్‌బాస్‌ టీమ్‌తో పాటు సల్మాన్‌కు కూడా లేఖ రాసింది. మీ పలుకుబడిని ఉపయోగించి రియాలిటీ షో నిర్మాతలను ఒప్పించండి అనీ గాడిదను సెట్స్‌ నుంచి తొలగించి..తమకు అప్పగించండి అని సల్మాన్‌కు పెటా ఇండియా విజ్ఞప్తి చేసింది. జంతువులను వినోదం కోసం ఇలా ఉపయోగించొద్దని కోరింది. ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలిపింది.

బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఆ గాడిదను సల్మాన్‌.. గద్‌రాజ్‌ అని పిలుస్తూ.. దానితో మాట్లాడడంపైనా కొందరు అభ్యంతరం తెలిపారు. ‘ఒకవేళ నువ్వు గెలిస్తే.. నిన్ను ఎలా ఎత్తుకోవాలి. నీ చెవులు పట్టుకొని నిన్ను ఎత్తుకుంటాను’ అని సల్మాన్ గాడిదతో సంభాషించారు. మొత్తానికి దీన్ని బిగ్‌బాస్‌ సెట్స్‌ నుంచి పంపించేయడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది.

ఇక్కడ చదవండి: తస్సాదియ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ‘యజ్ఞం’ హీరోయిన్.. ఫోటోలతో రచ్చ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.