నవజాత శిశువును వీధిలో వదిలి పారిపోయిన తల్లి కేసులో కోర్టు సంచలన తీర్పు..!
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని JMFC కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన నవజాత శిశువును రోడ్డుపై వదిలి పారిపోయినందుకు ఒక మహిళకు ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు రూ. 10,000 జరిమానా విధించింది. నవజాత శిశువును రోడ్డుపై వదిలిపెట్టిన కేసు బాగల్‌కోట్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఇందుకు సంబంధించిన కేసును విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

సిద్ధవ్వ హనుమంత సంగ్ అనే ఆ మహిళ తన భర్తను ఎనిమిదేళ్ల క్రితం కోల్పోయింది. ఆ తర్వాత ఆమె అక్రమ సంబంధం ద్వారా గర్భవతి అయ్యింది. ఆగస్టు 6, 2023న బాగల్‌కోట్ తాలూకాలోని బెనకట్టి-కామటగి రోడ్డులో తన నవజాత కొడుకును విడిచిపెట్టింది. దీంతో బాగల్‌కోట్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు మొత్తం కేసును దర్యాప్తు చేసి ఆ మహిళను దోషిగా నిర్ధారించారు. PSI శరణబసప్ప దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సీనియర్ ప్రాసిక్యూటర్ శారద ప్రభుత్వం తరపున కోర్టులో వాదించారు. దీనిపై వాదనలు పూర్తి అయ్యాక, బుధవారం (జనవరి 14) కోర్టు శిక్షను ఖరారు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..