AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రాణమిచ్చే ఫ్యాన్స్.. పేరు చెబితే పూనకాలే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?

అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇక అతడి సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లలో పండగే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనికి భారీగా అభిమానగణం ఉంది. అతడి కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతడు నటించిన సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.. అయినప్పటికీ అతడు నటించే సినిమాలపై భారీ హైప్ ఉంది. ఇంతకీ ఆ ఫోటోలోని కుర్రాడు మరెవరో కాదండి..

Tollywood: ప్రాణమిచ్చే ఫ్యాన్స్.. పేరు చెబితే పూనకాలే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?
Actor
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2024 | 9:46 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక వారి పర్సనల్ విషయాల గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక న్యూస్ సెలబ్రెటీస్ గురించి వింటుంటాం. కానీ ఈ మధ్యన నెట్టింట నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. యంగ్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా టాప్ నటీనటుల చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. ఆ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. ఎవరో గుర్తుపట్టండి. అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇక అతడి సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లలో పండగే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనికి భారీగా అభిమానగణం ఉంది. అతడి కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతడు నటించిన సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.. అయినప్పటికీ అతడు నటించే సినిమాలపై భారీ హైప్ ఉంది. ఇంతకీ ఆ ఫోటోలోని కుర్రాడు మరెవరో కాదండి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు వింటే వచ్చే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంటి చిత్రాల్లో నటించి అలరించారు. కానీ 1998లో వచ్చి తొలి ప్రేమ సినిమా మాత్రం పవన్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు.. బద్రి, ఖుషి , జానీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రాలతో తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో పవన్ స్థానం ప్రత్యేకం.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన పవన్.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీలు చూసుకుని తన సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.