వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని.. అమ్మాయి కన్నీళ్లు చూసినవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు: రీతూ చౌదరి
జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో రీతూ చౌదరి ఒకరు. ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది. ఇక అదే క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. రీతుచౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లోనూ పాల్గొంది.

రీతూ చౌదరి.. రీసెంట్ డేస్ లో బాగా వినిపించిన పేరు ఈ అమ్మడిదే.. పలు వార్తల్లో నిలిచింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లో డిమాన్ పవన్ తో ప్రేమాయణం నడిపి సందడి చేసింది. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ బయట మాత్రం ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి పై ఓ రేంజ్ లో మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. టీవీ షోల్లోనూ ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టే చూపించడంతో చాలా మంది ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి రకరకాల టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తమకు బంధువులు ఎవ్వరూ లేరు అని.. తనపై వచ్చిన కామెంట్స్ కు తన తల్లి ఎంతగానో బాధపడింది అని ఎమోషనల్ అయ్యింది రీతూ చౌదరి.
తాజాగా రీతూ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె అనేక విషయాలను పంచుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రీతూ చౌదరి తన బిగ్ బాస్ ప్రయాణం, బయటి ప్రపంచంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ డెమోన్ అని తెలిపింది. అలాగే హౌస్ లోపల ఉన్నప్పుడు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని.. అయితే, ఫైర్ స్ట్రోమ్ టీమ్ డెమోన్ పవన్ ను తనకు దూరంగా ఉండమని, రీతూ చెడ్డదని, అతడిని వాడుకుంటోందని చెప్పారు. వాళ్లు అలా చెప్పడం వల్ల తన తల్లి ఎంతో బాధపడ్డారని, చాలా కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేసింది రీతూ.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకు ఓట్లు వేయించాలని అందరిని అడిగారని, తన తల్లి ఓట్ల కోసం అడిగినప్పుడు ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్, మేము ఓటు వేయము’ అంటూ చాలా మంది అన్నారని ఎమోషనల్ అయ్యింది రీతూ.. అలాంటి బాధ ఏ ఆడపిల్లకూ రాకూడదని కన్నీళ్లు పెట్టుకుంది. తాను బయట ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపల వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్నని తెలిపింది.
హౌస్ నుంచి బయటకు వచ్చాక, తన గురించి ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నువ్వు ఏదో ఆశించి నన్ను నాశనం చేయాలనుకుంటే, అది కుదరదు. కర్మను నమ్ముతాను, అది కచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. సోషల్ మీడియాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఇష్టం వచ్చినట్లు మీమ్స్ సృష్టించడం, బ్యాడ్ కామెంట్స్ చేయడం ఒకవైపు, మళ్ళీ బయట కలిస్తే రీతక్కా, నేను పెద్ద ఫ్యాన్ అక్క అని అంటుంటారు. ప్రేమ పేరుతో మోసం చేసే వారి గురించి మాట్లాడుతూ, ‘అమ్మాయి కన్నీళ్లు చూసినవాడు ఏదో ఒక రోజు దారుణమైన పరిస్థితిలో ఉంటాడు. నేను దాన్ని పూర్తిగా నమ్ముతాను” అని అన్నారు. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే, తన తల్లి, అన్నయ్యల కన్నా ముందు తనను తీసుకెళ్లమని కోరుతానని, ఎందుకంటే నేను లేకపోతే వారికి ఎవరూ లేరని రీతూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
