Andhra News: విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రైన్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన రెండు వ్యాగన్‌లు
నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో కావలి రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ట్రైన్‌కు ఉన్న రెండు వ్యాగన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు పడిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకన్న సిబ్బంది. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. లోకో పైలట్ కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి వెళ్తున్న ఈ గూడ్స్ ట్రైన్ సరిగ్గా కావలి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో ట్రైన్‌లోని రెండు వ్యాగన్‌లు పట్టాల నుంచి పక్కకు పడిపోయాయి. గమనించిన లోకోపైలట్ వెంటనే ట్రైన్ ఆపేసి.. రైల్వే సిబ్బంది, అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఈ ప్రమాదం కారంణంగా ఆ మార్గంలో నడిచేపలు రైళ్లకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
