JAM 2026 Exam Date: జామ్ 2026 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM 2026) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్..

హైదరాబాద్, జనవరి 15: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM 2026) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఫిబ్రవరి 15న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 20న ఫలితాలు వెలువడనున్నాయి.
ఐఐటీ బాంబే అధికారిక వైబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్, సిలబస్‌తోపాటు 12 ఏళ్ల పాత ప్రశ్నాపత్రాలను కూడా అందుబాటులో ఉంచింది. ఉచిత మాక్ టెస్టులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. జామ్ 2026 ద్వారా ఐఐటీలు, ఐఐఎస్‌సీలలో ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. జామ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఈ ఏడాదికి మొత్తం 22 ఐఐటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో దాదాపు 3 000 సీట్లు భర్తీ చేయనుంది.
జామ్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూజీసీ నెట్ 2025 ఆన్సర్ కీ విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) డిసెంబర్ 2025 పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ, రెస్పాన్స్‌షీట్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 14 నుంచి 17 వరకు ఆన్సర్ కీలపై అభ్యంతరాలను తెలియచేయాలని తెలిపింది. కాగా మొత్తం 85 సబ్జెక్టులలో డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. ఏటా ఈ పరీక్షలను రెండు సార్లు ఎన్టీయే నిర్వహిస్తుంది.
యూజీసీ నెట్ 2025 ఆన్సర్ కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




