- Telugu News Photo Gallery Cinema photos Actress Rakul Preet Singh Says She Was Replaced By Kajal In Prabhas Movie
Prabhas: ప్రభాస్ సరసన ఛాన్స్.. షూటింగ్ అయ్యాక నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు.. రకుల్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అగ్రకథానాయకులతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగు తెరకు దూరంగా ఉంటుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఎలా మిస్సయ్యిందో చెప్పుకొచ్చింది.
Updated on: Oct 15, 2024 | 9:22 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అగ్రకథానాయకులతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగు తెరకు దూరంగా ఉంటుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఎలా మిస్సయ్యిందో చెప్పుకొచ్చింది. ప్రభాస్ సరసన ఓ ప్రాజెక్ట్ ఛాన్స్ వచ్చిందని.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలిపింది. కానీ నెక్ట్స్ షెడ్యూల్ కు తనను తొలగించారని తెలిపింది.

షూటింగ్ స్టార్ట్ అయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని.. తన స్థానంలో హీరోయిన్ కాజల్ ను తీసుకున్నట్లు తర్వాత తెలిసిందని.. కనీస సమాచారం కూడా లేకుండా తనను సినిమా నుంచి తొలగించారని చెప్పింది.

అప్పటికే కాజల్, ప్రభాస్ కాంబోలో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చింది.. దీంతో మరోసారి ఆ ఇద్దరి జోడి రిపీట్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ తనను తొలగించి కాజల్ ను తీసుకుందని.. సినిమా అనేది ఓ వ్యాపారం అని చెప్పుకొచ్చింది.

ఇందులో కొత్తగా పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమే అని.. తనకు ఎన్నోసార్లు ఇలా జరిగిందని.. ఒక అవకాశం కోల్పోయినా.. అందుకు మించిన ఆఫర్ మన కోసం ఎదురుచూస్తుంటుందని తెలిపింది. గతంలోనూ రకుల్ నెపోటిజం గురించి కామెంట్స్ చేసింది.




