Mufasa-The Lion King: ముఫాసాతో సిద్ధమంటున్న మహేష్
సంక్రాంతి సినిమాల ఫషిలింగ్ పూర్తయినా, ఫిల్మ్ నగర్‌లో దాని తాలూకు సౌండ్ మాత్రం ఇంకా తగ్గలేదు. డిసెంబర్ 20కి వచ్చే సినిమాల గురించి గట్టిగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇయర్ ఎండ్ రేసులో మేమూ ఉన్నామంటున్న...మన హీరోలు.. మహేష్ టు ప్రియదర్శి గురించి మాట్లాడుకుందాం పదండి... ముఫాసా ద లయన్ కింగ్.. యాక్షన్ అడ్వంచరస్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది.
Updated on: Oct 14, 2024 | 10:11 PM

బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు.. బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB29తో హాలీవుడ్‌లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు.

ముఫాసా ద లయన్ కింగ్.. యాక్షన్ అడ్వంచరస్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. డిసెంబర్ 20న రిలీజ్‌కి రెడీ అయింది. ముఫాసా కేరక్టర్‌కి మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని వినడానికి, తెర మీద ఈ సినిమాను చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు.

అదే రోజున నేనూ వస్తానంటూ రీ కన్‌ఫర్మ్ చేశారు నితిన్. ఆయన నటించిన రాబిన్‌హుడ్ విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబర్ 20న వస్తామంటూ నితిన్ రాబిన్ హుడ్‌తో పాటు... ముందు నుంచి చెబుతున్నారు తండేల్ నాగచైతన్య.

ఎప్పుడు క్రిస్మస్ వీక్ గుర్తుకొచ్చినా చైతన్య తండేల్‌ని కూడా కలిపే గుర్తుచేసుకుంటున్నారు సినీ జనాలు. సూపర్ హిట్ మూవీ మ్యాడ్‌కి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే రోజుకి రిలీజ్ అవుతుందన్నది ఫిల్మ్ నగర్ టాక్.

గేమ్ చేంజర్ సంక్రాంతికి షిఫ్ట్ అయిన న్యూస్ చెప్పీ చెప్పగానే సీన్‌లోకి వచ్చేశారు ప్రియదర్శి. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ప్రియదర్శి టైటిల్ పాత్రలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి రెడీ అంటోంది యూనిట్.




