- Telugu News Photo Gallery Cinema photos Good news for pawan kalyan fans first song from Hari hara veeramallu will be released Soon
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే హరిహరవీరమల్లు నుంచి తొలి పాట రిలీజ్
సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఓ యోధుడు చేసిన అలుపెరగని పోరాటమే హరిహరవీరమల్లు అంటూ ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతా బాగానే ఉంది... నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పటి నుంచీ అని ఆరా తీస్తున్న వారి కోసం చాలా విషయాలే చెప్పుకొచ్చారు.. ఆ డీటైల్స్ మనం కూడా మాట్లాడుకుందాం పదండి..
Updated on: Oct 14, 2024 | 10:00 PM

సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఓ యోధుడు చేసిన అలుపెరగని పోరాటమే హరిహరవీరమల్లు అంటూ ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్.

అంతా బాగానే ఉంది... నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పటి నుంచీ అని ఆరా తీస్తున్న వారి కోసం చాలా విషయాలే చెప్పుకొచ్చారు.. ఆ డీటైల్స్ మనం కూడా మాట్లాడుకుందాం పదండి.. అప్పుడెప్పుడో బ్రోతో స్క్రీన్ మీదకు వచ్చారు.

ఆ తర్వాత ఆయన మేకప్ వేసుకోనేలేదు అని బెంగ పెట్టుకున్న అభిమానుల గురించి ఆలోచించారు పవర్‌స్టార్. మేకప్ కిట్ సిద్ధం చేయమని సిగ్నల్స్ ఇచ్చేశారు. అక్టోబర్ 14 నుంచి హరిహరవీరమల్లు షూటింగ్ మొదలు కాబోతోంది. 18 నుంచి పవన్ కల్యాణ్ సెట్స్ కి హాజరవుతారని న్యూస్.

ఉన్న కీలకమైన సన్నివేశాలను సంక్రాంతి లోపు కంప్లీట్ చేసేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మార్చిలో హరిహరవీరమల్లు డేట్ ఫిక్స్ అయింది.

ఫస్ట్ సాంగ్‌ని తెలుగులో పవన్ పాడారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ప్రేక్షకులకు స్పెషల్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఎర్లీ సమ్మర్‌లో హరిహరవీరమల్లు హవా మామూలుగా ఉండదంటున్నారు మేకర్స్




