Devara: రూ.500 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసిన దేవర కలెక్షన్లు
మళ్లీ ఎప్పుడు దేవర? అని గట్టిగానే అడుగుతున్నారు నందమూరి అభిమానులు. ఈ సారి వాళ్లు మళ్లీ ఎప్పుడు అని అడుగుతున్నది దేవర సెకండ్ పార్ట్ గురించి కాదు... ట్రిపుల్ ఆర్ క్రియేట్ చేసిన వెయ్యి కోట్ల మార్క్ గురించి... దేవర 16 రోజుల కలెక్షన్లను మేకర్స్ సగర్వంగా అనౌన్స్ చేసిన ఈ టైమ్‌లో థౌజండ్ క్రోర్స్ గురించి మాట్లాడుతున్నారు అభిమానులు.
Updated on: Oct 14, 2024 | 9:45 PM

యతి రోల్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడ్ని సెలెక్ట్ చేయటం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్నారు. ప్రజెంట్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు.

16 రోజుల్లో మన దేవర 500 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడహో అని సగర్వంగా చెప్పేశారు మేకర్స్. ఎన్టీఆర్ ఒన్ మ్యాన్ షో అని సూపర్‌హిట్ చేసేశారు మూవీ లవర్స్. ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా చేసిన సినిమా ఆ మాత్రం కలెక్ట్ చేయకపోతే ఎలా అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

దేవర ఓ బెంచ్‌మార్క్ ని టచ్ చేసింది.. మరి ట్రిపుల్ ఆర్ చేసినట్టు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయగల సత్తా ఉన్న సినిమాలేంటనే ఆరా మొదలైంది. ఇప్పుడు నార్త్ లో హృతిక్‌తో కలిసి వార్2లో చేస్తున్నారు తారక్.

సీక్వెల్‌లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది. ఆ రోల్‌లో కనిపించబోయే నటుడి కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు మేకర్స్. దేవర సినిమాలో కీలక పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప ఈ విషయాన్ని రివీల్ చేశారు.

సక్సెస్ సెలబ్రేషన్స్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ, పార్ట్ 2 వర్క్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.




