Heroines: శక్తి రూపాలుగా బ్యూటీస్.. లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఆ హీరోయిన్స్ ఫోకస్..
దసరా అంటేనే శక్తి రూపానికి సంబంధించిన పండుగ. చెడును అంతం చేసే మహా శక్తిగా ఈ పండుగ రోజు అమ్మవారిని పూజిస్తారు. అందుకే ఈ పండుగ సందర్భంగా వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్న శక్తి రూపాలు, అదే లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కూడా ఓ లుక్కేద్దాం.
Updated on: Oct 15, 2024 | 12:44 PM

టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది అనుష్క పేరే. అరుంధతి, పంచాక్షరీ, భాగమతి లాంటి లేడీ ఓరియంట్ సినిమాల్తో సత్తా చూపించారు. ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించినా... తన మార్క్ మూవీస్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు స్వీటీ.

ప్రజెంట్ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ అనే సినిమా చేస్తున్నారు. తన వ్యాపారాలకు నష్టం కలిగించిన వారి మీద ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌లోనూ నటిస్తున్న బ్యూటీ తమన్నా. ముఖ్యంగా డిజిటల్‌లో లేడీ ఓరియంటెడ్ సిరీస్‌లకు కేరాఫ్‌గా మారిన మిల్కీ బ్యూటీ, ప్రజెంట్ ఓదెల 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శివ శక్తిగా కనిపించబోతున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

కమర్షియల్ సినిమాను లేడీ ఓరియంటెడ్ జానర్‌లో పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న మరో బ్యూటీ సమంత. యశోధ, శాకుంతలం లాంటి డిఫరెంట్ మూవీస్‌తో పాటు ది ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్ లాంటి యాక్షన్ సిరీస్‌లలో నటించింది.

సామ్ ఇప్పుడు మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఫ్యూచర్‌లోనూ ఎక్కువగా ఈ జానర్‌లోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.




