- Telugu News Photo Gallery Cinema photos What is the next step in the journey of Rajinikanth directors?
Directors: హుషారుగా తలైవా దర్శకులు.. ఈ కెప్టెన్ల నెక్స్ట్ మజిలీ ఏంటి.?
రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ ఎంత హుషారుగా ఉన్నారో, ఆయనతో సినిమాలు చేస్తున్న కెప్టెన్లు కూడా అంతకు మించిన జోష్‌తో కనిపిస్తున్నారు. జైలర్, వేట్టయన్, కూలీ కెప్టెన్ల జర్నీలో నెక్స్ట్ మజిలీ ఏంటి? ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం పదండి...
Updated on: Oct 15, 2024 | 12:38 PM

వేట్టయన్ సినిమాకు మార్నింగ్ షోతోనే యునానిమస్ పాజిటివ్ బజ్ క్రియేటైంది. జై భీమ్‌లాంటి మూవీ చేసిన డైరక్టర్, జైలర్ సక్సెస్ మీదున్న సూపర్‌స్టార్ రజనీతో చేసిన సినిమా ఎలా ఉంటుందోనని అప్పటిదాకా జరిగిన డిస్కషన్‌కి, రిలీజ్‌డే పాజిటివ్ టాక్ ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

తన నెక్స్ట్ మూవీ సూర్యతో ఉంటుందని చెప్పేశారు జ్ఞానవేల్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైందని హింట్ ఇచ్చారు. జై భీమ్ కాంబోలో వచ్చే ఆ స్టోరీ మీద అప్పుడే బజ్ మొదలైంది.

ఓ వైపు వేట్టయన్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్... ప్రస్తుతం కూలీ మూవీ పనుల్లో ఉన్నారు. నా కెరీర్‌లో నేను ఏ సినిమానూ ఆరు నెలలకు మించి తీయలేదు. కూలీని కూడా ఆరునెలల లోపే పూర్తి చేసేయాలనుకుంటున్నారు లోకేష్.

ఆ వెంటనే ఎల్‌సీయూలో ఉన్న హీరోలందరితో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కూలీ... ఎల్‌సీయూలో ఉండదు అని తన ట్రావెల్ డీటైల్స్ చెప్పేశారు ఈ బ్లక్ బస్టర్ కెప్టెన్. కూలీ పూర్తి కాగానే ఎల్‌సీయూ హీరోలతో ప్రాజెక్ట్ మొదలుపెట్టేస్తారు లోకేష్.





