- Telugu News Photo Gallery Cinema photos Actor Ajith Kumar's Veeram Movie Child Artist Yuvina Parthavi Latest Photos Goes Viral
Tollywood : వామ్మో! ఇదేం మేకోవర్ భయ్యా.. ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే తేజా సజ్జా, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీదివ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్ సినిమాల్లో మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. అందులో యువీనా పార్థవి కూడా ఒకరు.
Updated on: Oct 15, 2024 | 1:11 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే తేజా సజ్జా, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీదివ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్ సినిమాల్లో మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. అందులో యువీనా పార్థవి కూడా ఒకరు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. స్టార్ హీరోలతో కలిసి నటించింది. అమాయకపు మాటలు.. అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

అజిత్ సినిమాలో నటించిన చిన్నారి యువీనా పార్థవి లేటేస్ట్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. యువినా పార్థవి 2013లో విడుదలైన 'ఇవాన్ ఏ కమల్' చిత్రంతో తమిళ చిత్రసీమలో బాలతారగా అడుగుపెట్టింది. ఆ తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి సినిమాల్లో కనిపించింది.

'మాస్ అనక మాసిలామణి'లో సూర్య కూతురిగా కనిపించిన యువీనా.. ఆ తర్వాత అజిత్ నటించిన వీరమ్ సినిమాలోనూ నటించింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజిత్, యువినా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు యువినా టీనేజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వీరమ్ సినిమాలో చిన్నారిగా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా కనిపిస్తుందేంటీ ? అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.