- Telugu News Photo Gallery Cinema photos Hero Dulquer salmaan speed up shooting on his next movie in telugu Telugu Heroes Photos
Dulquer salmaan: దుల్కర్ మలయాళం హీరోనా.? మన హీరోనా.? ఎండ్ కార్డ్ పడింది.!
దుల్కర్ మలయాళం హీరోనా? మన హీరోనా? అనే డిస్కషన్‌కి ఎప్పుడో ఎండ్ కార్డ్ పడింది. ఆయనిప్పుడు ప్యాన్ ఇండియన్ హీరో. అందుకే ఎక్కడ ఏం చేసినా, ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే అన్నీ ఇండస్ట్రీలోనూ అలార్మ్ రింగింగ్ సౌండ్ వినిపిస్తోంది. మహానటి సినిమా చూశాక జెమిని గణేశన్ రోల్‌కి దుల్కర్‌కన్నా ఫిట్ అయ్యే ఆర్టిస్ట్ ఎవరని ఎంత ఆలోచించినా ఇంకో పేరు గుర్తుకురాలేదు మనవాళ్లకి.
Updated on: Oct 16, 2024 | 12:49 PM

దుల్కర్ మలయాళం హీరోనా? మన హీరోనా? అనే డిస్కషన్‌కి ఎప్పుడో ఎండ్ కార్డ్ పడింది. ఆయనిప్పుడు ప్యాన్ ఇండియన్ హీరో.

అందుకే ఎక్కడ ఏం చేసినా, ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే అన్నీ ఇండస్ట్రీలోనూ అలార్మ్ రింగింగ్ సౌండ్ వినిపిస్తోంది.

మహానటి సినిమా చూశాక జెమిని గణేశన్ రోల్‌కి దుల్కర్‌కన్నా ఫిట్ అయ్యే ఆర్టిస్ట్ ఎవరని ఎంత ఆలోచించినా ఇంకో పేరు గుర్తుకురాలేదు మనవాళ్లకి. అంతగా కనెక్ట్ అయ్యారు దుల్కర్ యాక్టింగ్‌కి.

ఆయన పక్కనుంటే హీరోయిన్లు స్క్రీన్ మీద మరింతగా గ్లోరిఫై అవుతారన్నది ఇండస్ట్రీలో ఉన్న మాట. సీతారామమ్‌లో మృణాల్ ఠాకూర్‌కి కూడా అంతే స్క్రీన్ స్పేస్ దక్కింది.

ఈ విషయం గురించి ఈ మధ్య మాట్లాడారు దుల్కర్. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసినప్పుడు, ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది. అలా, కొన్ని సినిమాలు సరిగా ఆడకపోవడంతో వాంటెడ్‌గానే స్పీడ్ తగ్గించినట్టు చెప్పారు దుల్కర్.

హెల్త్ పరంగానూ కాసింత శ్రద్ధ తీసుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ ఏడాది ఆల్రెడీ కల్కిలో మెప్పించారు దుల్కర్ సల్మాన్. ఈ నెల్లోనే లక్కీ భాస్కర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆల్రెడీ మహానటి, సీతారామమ్‌తో తెలుగువారి మనసులు దోచుకున్న దుల్కర్‌కి, లక్కీ భాస్కర్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.




