Bhartha Mahasayulaki Wignyapthi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విజయానికి కారణం ఆయనే.. డైరెక్టర్ కిశోర్ తిరుమల కామెంట్స్..
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ని సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్. ఆడియన్స్ సినిమాని నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోంది అని అన్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిగినింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులని నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. మేము అనుకున్న టార్గెట్ ని 100% రీచ్ అయ్యాం. ఆడియన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. సత్య గారు వెన్నెల కిషోర్ గారు సునీల్ గారు అన్ని పాత్రలు కూడా హిలేరియస్ గా ఉన్నాయి. నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు అని అంటారు. ఈ సినిమాతో ఆ ఆడియన్స్ డబుల్ అయ్యారు. ఈ సినిమా అందరికీ ఇంత బాగా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియో బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా బీమ్స్ కి వెళుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. కార్తీకదీపం, పిన్ని డీజే మిక్స్ సాంగ్స్ కి అందరూ మురిసిపోతున్నారు.ఆషిక ఇమేజ్ ని బ్రేక్ చేసిన క్యారెక్టర్ చేశారు. తను క్యారెక్టర్ లో బెస్ట్ ఇచ్చింది. అలాగే డింపుల్ ఇమేజ్ ని కూడా బ్రేక్ చేసిన క్యారెక్టర్ చేసింది. ఇద్దరు కూడా అద్భుతంగా పెర్ ఫాం చేశారు.
ఈ స్క్రిప్ట్ లో పవన్ నాకు హెల్ప్ చేశాడు. ఈ టైటిల్ ఇచ్చింది కూడా తనే. చాలా మంచి టీం తో పని చేసాము. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత సుధాకర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫ్యామిలీతో పాటు వెళ్ళండి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సక్సెస్ మీట్ లో పబ్ సాంగ్ కి డాన్స్ చేస్తాను( నవ్వుతూ)రవితేజ గారికి నాకు పదేళ్ళుగా పరిచయం. ఎప్పటి నుంచో కలిసి పని చేయాలనుకుంటున్నాం. లక్కీగా ఇది కుదిరింది. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రవితేజ గారు. ఆయనకి ధన్యవాదాలు”అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
