గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?
గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లతో నిండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఖాళీ కడుపుతో తాగితే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టానిన్లు, పాలీఫెనాల్స్ దీనికి కారణం. బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి గ్రీన్ టీ తోడ్పడుతుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాత లేదా అల్పాహారం తర్వాత తాగడం ఉత్తమం.

గ్రీన్ టీ ఆరోగ్యానికి అనే విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అది లోపలి నుంచి తాజాదనాన్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ప్రజలు గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఇది చేస్తే గ్రీన్ టీ ఆమ్లతను కలిగిస్తుంది. గ్రీన్ టీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. ఆ బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గ్రీన్ టీలోని కెఫిన్, కాటెచిన్స్ కలయిక జీవక్రియను పెంచడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
కొంతమంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీర ఆకృతిని కాపాడుకోవడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ భోజనం తర్వాత అనువైనదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత గ్రీన్ టీ తాగడం మానుకోండి. ఎందుకంటే కెఫిన్ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.
గ్రీన్ టీలో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ పద్ధతి అనుసరించే వారిలో కడుపు సహజ జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు రెండే. భోజనం లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత మాత్రమే ఈ పానీయం తీసుకోవాలి.
గ్రీన్ టీని ఎల్లప్పుడూ భోజనం తర్వాత తీసుకోవాలి. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది,. ఇది గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేయడం ద్వారా కడుపుకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల తలతిరగడం, వాంతులు కూడా వస్తాయి. . గ్రీన్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు సమస్యల త్వరగా నివారించి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. సాయంత్రం వేళల్లో శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే గ్రీన్ టీ తాగితే తక్షణమే ఎనర్జిటిక్ గా మారతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




