Vaishnavi Chaitanya: ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న వైష్ణవి చైతన్య.. ఏ సినిమానో తెలుసా.. ?
వైష్ణవి చైతన్య.. ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పుతున్న తెలుగమ్మాయి. ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పిస్తుంది. అయితే వైష్ణవి మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ గురించి తెలుసా.. ? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.

వైష్ణవి చైతన్య.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. బేబీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బేబీ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వైష్ణవికి.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
బేబీ తర్వాత లవ్ మీ, జాక్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో మరిన్ని చిత్రాలతో బిజీగా ఉంది. పదిహేనేళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది వైష్ణవి. గతంలో బేబీ మూవీ ప్రమోషన్లలో తన జర్నీ గురించి అనేక విషయాలు పంచుకుంది. ఓ ఈవెంట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందలు ఇచ్చారని తెలిపింది. ఇక బేబీ సినిమాకు ముందు ఆమె రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుందట.
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..
అందులో ఒకటి బలగం సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా వైష్ణవిని ఎంపిక చేసుకున్నారట. కానీ అప్పటికే ఆమె బేబీ సినిమాతో బిజీగా ఉండడంతో బలగం నుంచి తప్పుకుందట. దీంతో బేబీ కోసం బలగం బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన బేబీ మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమె క్రేజ్ మారిపోయింది.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..







