‘మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం’ CM రేవంత్‌కు మెగాస్టార్ స్పెషల్ మెసేజ్
రెండున్నర వారాలుగా సాగిన టాలీవుడ్ కార్మికుల సమ్మె మొత్తానికి ముగిసింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన టాలీవుడ్ సినీ కార్మికులకు ఆగస్టు 21న ఎట్టకేలకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, నిర్మాతల మధ్య కొన్ని మాటల తూటాలు పేలినా, ప్రభుత్వం చొరవతో కథ సుఖాంతమైంది.
దీంతో శుక్రవారం నుంచి షూటింగులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమ్మెకు ముగింపు పలికేలా చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో చిరు ఏం రాసుకొచ్చారంటే…! “ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా” అంటూ మెగాస్టార్ చిరు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాడ్ లక్ అనుపమా..? ఈ సినిమా రిజెల్ట్ కూడా.. మూవీ రివ్యూ…
13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
నటిని హోటల్‌కు రమ్మన్న MLA.. దెబ్బకు పదవి, పరువు పాయే..!




