13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
ఈ మధ్యన నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. థియేటర్లతో పాటు ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. ఆ సినిమానే రుద్రి.
కన్నడ భాషలో.. బడిగేర్ దేవుంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ అందర్నీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా 13 అవార్డులు గెలుచుకుని.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అయింది. ఇక రుద్రి సినిమా కథ విషయానికి వస్తే.. అది ఉత్తర కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం. ఒక అనాథ యువతి, తన అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది. పొట్ట కూటి కోసం ఒక టీ షాప్‌లో పనిచేస్తుంటుంది. చుట్టు పక్కల వారితో ఎంతో కలివిడిగా ఉండే ఆ అమ్మాయి జీవితం ఒక రాత్రి చిన్నాభిన్నామవుతోంది. నలుగురు దుర్మార్గులు ఆ అమ్మాయిపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడుతారు. ఈ ఘటన ఆమెను బాగా కుంగదీస్తుంది. దీనికి తోడు సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. దీంతో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ నలుగురు దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక పథకాన్ని రచిస్తుంది. అలా తనపై దాడి చేసినవారిని ఒక్కొక్కరినీ గుర్తిస్తూ హతమారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారి ఈ వరుస హత్యల కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఒక చిన్న క్లూతో ఆ అమ్మాయిని గుర్తిస్తాడు. అయితే ఆమె ఎందుకు అలా మారిపోయందో, ఈ హత్యలు ఎందుకు చేస్తుందో తెలుసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇలా సాగే ఈ సినిమాలో.. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. మరి ఈ ట్విస్ట్ ఏంటి ? ఆ అమ్మాయి ఆ దుర్మార్గులపై ప్రతీకారం ఎలా తీర్చుకుందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడలనుకునేవారికి రుద్రి ఒక బెస్ట్ ఛాయిస్.. వీలుంటే ఓ లుక్కేయండి! అయితే ప్రస్తుతానికైతే తెలుగులో అందుబాటులో లేదు.. కన్నడ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంది. కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు.! వన్స్ ట్రై!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటిని హోటల్‌కు రమ్మన్న MLA.. దెబ్బకు పదవి, పరువు పాయే..!
చిరు బర్త్‌డే వేళ.. చరణ్ ఎమోషనల్ మెసేజ్
టీజర్‌ను చూసి కన్ఫూజన్‌లో ఫ్యాన్స్?
మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!
NTR సినిమా 15కోట్ల సెట్టా.. ఆ పైసలతో ఇంకో సినిమానే చేసేయొచ్చుగా…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

