తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఈ బ్యూటీ. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది . బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. తెలుగులో చివరిగా ఒడియన్ టు అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా తమన్నాకు ఊహించని ఘటన ఎదురైంది. ఓ అభిమాని చేసిన పనికి షాక్ అయింది తమన్నా. తాజాగా తమన్నా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. తమన్నాతో పాటు అక్కడే జాన్వీ కపూర్ కూడా కనిపించింది. ఇద్దరు బామ్మలు ముంబై విమానాశ్రయంలో కనిపించే సరికి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఓ అభిమాని తమన్నాను వెనక్కి నెట్టిమరి జాన్వీ కపూర్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. అభిమాని తమన్నాను వెనక్కి వెళ్ళమని జాన్వీతో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తమన్నా జాన్వీ కపూర్ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ఫ్లైట్ దిగారని తెలుస్తుంది. ఫ్లైట్ దిగి విమానాశ్రయంలో నడుచుకుంటూ వస్తుండగా అభిమానులు ఫోటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే జాన్వీ అభిమానులు తమన్నాను పక్కన పెట్టేసి మరి జాన్వీతో ఫోటోలు దిగారు. తమన్నా కూడా ఎంతో సహనంగా వాళ్లు ఫోటోలు దిగేవరకు అలా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తమన్నా ఫ్యాన్స్ స్పందిస్తూ జాన్వీ ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేశారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
మరిన్ని వీడియోల కోసం:
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో
కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

