కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో
దేశంలో ఇటీవల గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండీ.. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ..డాన్సులేస్తూ.. నవ్వుతూ పలకరించిన చెట్టంత మనుషులు చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. కూతురి పెళ్లిలో అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెళ్ళింట తీవ్ర విషాదం నెలకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామానికి చెందిన బానోతు మోహిలాల్, కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సింధును టేకులపల్లి మండలానికి చెందిన బాలాజీ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంటి దగ్గరే జరిగిన వివాహం బంధుమిత్రులతో కలకలలాడింది. ఆగస్టు 17, ఆదివారం ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం తన కూతురు సింధును వియ్యాలవారికి అప్పగింతలు చేస్తున్న తరుణంలో సింధు తల్లి కళ్యాణి తన కూతురు తనకు దూరమవుతుందన్న భావోద్వేగంతో హఠాత్తుగా కుప్పకూలిపోయింది.దీంతో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కళ్యాణిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఊహించని ఘటనతో పెళ్లింట విషాదం నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆనందంలో మునిగితేలుతున్న వేడుకల వాతావరణం మాయమైంది. ఈ హృదయ విదారకమైన సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
మరిన్ని వీడియోల కోసం :
వామ్మో ఇవేం పాములురో బాబు.. కుప్పలు కుప్పలుగా వీడియో
పుట్టగొడుగుల కూర తిన్న జంట.. కాసేపటికే విషాదం వీడియో
అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో
కొండచిలువలను వేటాడటంలో క్వీన్.. పదిరోజుల్లో ఏకంగా..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
