AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో

అడవిలో అద్భుతం.. చూడనీకి రెండు కళ్లు చాలవు వీడియో

Samatha J
|

Updated on: Aug 19, 2025 | 3:19 PM

Share

స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇండియా మొత్తం ఉత్సవాల్లో మునిగిపోయింది. గ్రామం మొదలు పట్టణాలు, నగరాల్లోని స్కూళ్లు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి, కవాతు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అడవిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

జాతీయ జంతువు పులి, జాతీయ పక్షినెమలి రెండూ కలిసి కవాతు నిర్వహించాయి. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘అరుదైన అద్భుత దృశ్యం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.పంద్రాగస్టు రోజున ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో సంచరిస్తున్న ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌కి అరుదైన దృశ్యం కనిపించింది. మన జాతీయ జంతువైన పులి,, జాతీయ పక్షి నెమలి రెండూ కలిసి ఒకే దారిలో ఒకదాని వెనుక మరొకటి నడుస్తూ కనిపించాయి. వీడియో చూసిన నెటిజన్లు.. ఇది అరుదైన దృశ్యం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ రెండూ కలిసి ఇలా నడుస్తూ కనిపించడంతో.. అందిరికీ అవి కవాతు చేస్తున్నట్లు అనిపించింది. నెమలి అడుగులో అడుగు వేసుకుంటూ ముందు వైపు వెళ్తుండగా.. వెనుక పులి దాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇలా ఆ రెండూ కలిసి చాలా దూరం వరకూ అలా మెల్లిగా నడుస్తూ వెళ్లాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌.. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోను IFS అధికారి పీఎం ధాకటే తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘వావ్.. ఇది ఎంతో అరుదైన, అద్భుత దృశ్యం’.. అంటూ కొందరు, ‘జాతీయ జంతువు, జాతీయ పక్షి కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఎప్పుడూ చూడలేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని వీడియోల కోసం 

భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!

ప్రాణం తీసిన కోడిగుడ్డు.. నోట్లో పెట్టుకోగానే వీడియో

శ్రీశైలం సమీపంలో దారుణం.. నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లిన చిరుత..

వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి..