Allu Arjun: అల్లు అర్జున్ వద్దన్నాడు.. నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టాడు.. ఏ సినిమానో తెలిస్తే షాక్ అవుతారు
సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా సహజం. ఒక హీరో వద్దన్న కథలు మరో హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటుంది. అలా చేతులు మారిన కథలు ఒక్కోసారి హిట్ అవుతుంటాయి.. మరికొన్ని సార్లు ఫట్ అవుతుంటాయి.

అల్లు అర్జున్, నాగ చైతన్య.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇద్దరి స్టార్ హీరోల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బన్నీ దూసుకు పోతుంటే, లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో నాగ చైతన్య సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ఆ మధ్యన పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాడు నాగ చైతన్య. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. మన దేశంలో దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. తండేల్ సినిమాతో మొదటి సారి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే ఈ ఐకాన్ స్టార్ పలు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. అలా వద్దనుకున్న కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరొకొన్ని ఫ్లాఫ్ అయ్యాయి. అలా బన్నీ వద్దన్న ఓ కథతో నాగ చైతన్య సినిమా చేశాడు. కట్ చేస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్ లోనే మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? 100 పర్సెంట్ లవ్
ఆర్య తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ ల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే సుకుమార్ తాను ఏ కథ రాసుకున్న ముందు అల్లు అర్జున్ కు చెబుతాడట. అలా 100 % లవ్ సినిమా కథ కూడా ముందు అల్లు అర్జున్ కే చెప్పాడట. కానీ అప్పటికే బన్నీ సినిమా డైరీ ఫుల్ అయిపోయిందట. పైగా ఈ కథకు బన్నీ కనెక్ట్ కాలేకపోయాడట. ఈ సాఫ్ట్ లవ్ స్టోరీస్ తనకు పెద్దగా సెట్ అవ్వవని సుకుమార్ కు చెప్పాడు కూడా. దీంతో ఇదే కథను నాగ చైతన్యతో తెరకెక్కించి హిట్ కొట్టాడు సుకుమార్.
అల్లు అర్జున్- స్నేహారెడ్డిల క్యూట్ ఫొటో..
View this post on Instagram
అయితే దీని తర్వాత అల్లు- సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య 2, పుష్ప, పుష్ప2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








