Tollywood: ఈ టాలీవుడ్ స్టార్ పేరిట ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లేట్ మండి బిర్యాని.. అది కూడా మన హైదరాబాద్‌లోనే
భారతీయ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక స్థానముంది. అందుకే చాలా మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఈ టాలీవుడ్ స్టైలిష్ హీరోను చూస్తే రెండో అమితాబ్ బచ్చన్ అనుకుంటారు. అలా కెరీర్ ప్రారంభంలోనే రెండో బిగ్ బీ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

సినిమా హీరోలకు ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఫేమస్ అవుతారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంటారు. కొందరు డ్యాన్స్ లతో హైలెట్ అయితే, మరికొందరు ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో ఫేమస్ అవుతారు. ఇంకొందరు తమ పనులతో ఫేమస్ అవుతారు. అభిమానుల మనసుల్లో హీరోగా నిలిచిపోతారు. ఈ టాలీవుడ్ స్టార్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంతా స్థాయికి వెళ్లాలనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. కానీ ఈ నటుడు మాత్రం తన కెరీర్ ప్రారంభంలోనే రెండో అమితాబ్ అంటూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగనీ అతను బిగ్ బీ స్థాయి నటుడేమీ లేదు. కానీ సినిమాల్లోకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఈ నటుడు చూడడానికి అచ్చం అమితాబ్ లాగే కనిపించాడు. బాడీ పరంగా, లుక్స్ పరంగా రెండో అమితాబ్ అని అభిమానులతో మన్ననలు అందుకున్నాడు. నటనలో బిగ్ బీ స్థాయికి చేరుకోకపోయినా తన మంచి పనులతో ఎవరెస్ట్ అంతటి కీర్తిని సంపాదించుకున్నాడీ ఫేమస్ యాక్టర్. తన సామాజిక సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతనే రియల్ హీరో సోనూ సూద్. ఇవాళ (జులై 30) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనూసూద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే క్రమంలో ఈ నటుడికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా సోనూసూద్ చేసిన మంచి పనులకు గుర్తింపుగా అతని పేరిట హైదరాబాద్ లో మండి బిర్యానీ కూడా వడ్డిస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లేట్ మండి బిర్యానీగా దీనికి గుర్తింపు ఉంది. కొండాపూర్‌లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్‌లో దొరికే ఈ మండీ బిర్యానీని 15 నుంచి 20 మంది వరకు ఆరగించవచ్చు. 2023లో సోనూ సూద్ స్వయంగా హాజరై ఈ ప్లేట్ మండి బిర్యానీని ప్రారంభించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. సోనూ సూద్ పక్కా వెజిటేరియన్. నాన్ వెజ్ అస్సలు ముట్టడు.
ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ మండి బిర్యానీతో నటుడు సోనూ సూద్.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. సోను సూద్ చివరిసారిగా యాక్షన్-థ్రిల్లర్ ఫతే మూవీలో కనిపించాడు. ఈ చిత్రానికి అతనే దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నంది అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూసూద్. ఈ చిత్రానికి కూడా అతనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








