Captain Miller: మహేశ్, నాగ్, వెంకీలకు పోటీగా కోలీవుడ్ స్టార్ ధనుష్.. సంక్రాంతి బరిలోకి కెప్టెన్ మిల్లర్
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్, నాజర్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్, నాజర్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కెప్టెన్ మిల్లర్ సినిమాను మొదట డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా బుధవారం (నవంబర్ 8) రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కెప్టెన్ మిల్లర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ ప్రకటించింది. అంటే జనవరి 15 లేదా 14న ఈ సినిమా విడుదలవుతుంది. . ఇక కెప్టెన్ మిల్లర్ నయా పోస్టర్ లో ధనుష్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. కాగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
కాగా తమిళంలో కెప్టెన్ మిల్లర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అయితే తెలుగులో మాత్రం సంక్రాంతికి సుమారు అరడజను సినిమాలు రిలీజవుతున్నాయి. గుంటూరు కారం, నా సామి రంగ, హనుమాన్, సైంధవ, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. మరి వీటిని తట్టుకుని కెప్టెన్ మిల్లర్ ఏ మేర వసూల్లు సాధిస్తాడో చూడాల్సి ఉంది. కాగా 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరెక్కుతోంది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే వీరుడు పాత్రలో ధనుశ్ కనిపించనున్నారు. కాగా ధనుశ్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా వస్తుందని ప్రముఖ సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు తన స్వీయ దర్శకత్వంలోనే 50 సినిమా చేస్తున్నాడు ధనుష్.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ధనుష్ కెప్టెన్ మిల్లర్..
Our #CAPTAINMILLER is all set for a grand Release this PONGAL / SANKRANTI 2024 😎#CaptainMillerFromPongal#CaptainMillerFromSankranti @dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/xE43r89EEQ
— Sathya Jyothi Films (@SathyaJyothi) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




