AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయసులోనే లవ్.. చూడకూడనిది చూసా.. గుండె పగిలిపోయింది.. బ్రేకప్ స్టోరీ గుర్తుచేసుకున్న హాట్ బ్యూటీ

రీసెంట్ డేస్ లో పాపులర్ అవ్వడం చాలా ఈజీ అయ్యిపోయింది. కొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు, చాలా మంది తమ గ్లామర్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ బ్యూటీ.

చిన్న వయసులోనే లవ్.. చూడకూడనిది చూసా.. గుండె పగిలిపోయింది.. బ్రేకప్ స్టోరీ గుర్తుచేసుకున్న హాట్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2025 | 12:44 PM

Share

సినిమా ఇండస్ట్రీ లక్ ఎవరికి ఎప్పుడు తగులుతుందో తెలీదు. కొందరికి ఈజీగానే అవకాశాలు లభిస్తాయి. మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్లకి ఇంకా టఫ్ ఉంటుంది. ఇక హీరోయిన్ అవకాశాలు రావడం కూడా అంత ఈజీ ఏం కాదు. అందం, అభినయంతో పాటు చాలా లక్ కూడా ఉండాలి. కొందరు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ .. తామ అలా అయినా ఎవరి దృష్టిలో పడతావేమో అని ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ కూడా ఓవర్ నైట్ లోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకే ఒక్క గేమ్ షోతో  తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రీసెంట్ గా తన ప్రేమ కథతో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. చిన్నవయసులోనే అంటే 9తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

తను క్రేజీ యాంకర్… గ్లామర్‌తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ మాములుగా ఉండదు. తెలుగు ప్రేక్షకులు అందరికీ తను సుపరిచితురాలే. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ. తెలంగాణలోని తాండూరులో జనవరి 25 1993లో జన్మించింది ఈ బ్యూటీ. ఇక అరియానా అసలు పేరు అర్చన. కాకపోతే ఆ పేరు కలిసిరాకపోవడంతో.. అరియానాగా మార్చుకుంది. తొలుత 2015లో యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తెగ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

గతంలో అరియానా మాట్లాడుతూ.. తన బ్రేకప్ స్టోరీ తెలిపింది. నేను 9th క్లాస్ చదువుకుంటున్నప్పడే ప్రేమలోపడ్డాను. అతను మా బావ.. విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో ఉండేదాన్ని. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. అదే టైంలో మా బావకు జాబ్ వచ్చింది. దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకుని మూడేళ్లు కలిసి ఉన్నాం. ఆ టైంలో ఇద్దరం చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యాం. ఆతర్వాత నేను ఓ రోజు చూడకూడనిది చూసా.. నేను బోర్ కొట్టేశానేమో అనిపించింది. అప్పుడే నా గుండె బద్దలయ్యింది. ఆతర్వాత అతను నన్ను రిక్వెస్ట్ చేసుకున్నాడు. దాంతో మరో రెండేళ్లు కలిసి ఉన్నాం.. అదే టైం లో నేను ఆర్ జే అవ్వాలని కోర్స్ తీసుకున్నా అప్పుడు ఓ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు.. దాంతో మా బావ నాపై అనుమానం పెంచుకున్నాడు.. నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను మా బావ అపార్థం చేసుకున్నాడు.. దాంతో ఇద్దరం విడిపోయాం.. నాకు నాన్న లేకపోవడంతో ఎంతో కేరింగ్ గా చూసుకున్నాడు.. ఇప్పటికీ నాకు మా బావ గుర్తొస్తాడు అని చెప్పుకొచ్చింది అరియనా ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.