అయ్యబాబోయ్ శ్రీలీల ఏంటీ అలా మారిపోయింది..గుర్తు పట్టడం కష్టమే!
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో మూవీస్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరస ఆఫర్స్‌తో మంచి జోష్‌లో ఉంది. అయితే తాజాగా ఈ నటి బ్లాక్ కలర్ చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మను చూసిన తన అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు శ్రీలీలనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Updated on: Sep 02, 2025 | 2:21 PM

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఈ మధ్య వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంది. ఈ చిన్నది ఎ ప్పుడూ సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ చీరలో తన అంద చందాలతో అందరినీ కట్టిపడేసింది ఈ బ్యూటీ.

కన్నడ బ్యూటీ శ్రీలల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో ఈ అమ్మడు అందం, డ్యాన్స్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా , ఈ బ్యూటికి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు.

దీంతో ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ అందుకుంటూ ఏకంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ మూవీ అదృష్టం మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే? ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. దీంతో తర్వాత అవకాశాలు రావడం తగ్గాయి.

కానీ పుష్ప2లో కిసక్కీ .. అంటూ ఐటమ్ సాంగ్‌తో మరో సారి క్రేజ్ తెచ్చుకుంది. దీని తర్వాత శ్రీలీల వరసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.ఇక ఏ కాస్త సమయం దొరికినా సరే ఫొటో షూట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో డిఫరెంట్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందాన్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. చాలా అందంగా ఉంది. కానీ ఈ ఫొటోలు చూసిన ఈ బ్యూటీ అభిమానులు శ్రీలీల ఏంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



