Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..

అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna).

Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..
Rahul
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2022 | 10:06 AM

అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ఆ తర్వాత.. పెళ్లి చూపులు.. జాతిరత్నాలు వంటి సినిమాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. కమెడియన్‏గా.. నటుడిగా రాణిస్తూ మంచి ఫాంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక పై తాను సినిమాల్లో నటించనని తెలిపారు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు దూరం అవుతానని రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. దీంతో రాహుల్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

2014లో సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2017లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో స్నేహితుడిగా మెప్పించాడు. ఈ మూవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రాహుల్. అలాగే ఇటీవల వచ్చిన జాతిరత్నాలు, స్కైలాబ్ సినిమాల్లో రాహుల్ తన కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన నటించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, విరాటపర్వం వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రాహులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నావా ? లేదా ఏదైనా ప్రమోషన్ కోసమా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..