Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

యంగ్ హీరో శర్వానంద్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. గతలాకొంత కాలంగా శర్వానంద్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు.

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..
Aadavallu Meeku Joharlu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2022 | 5:21 AM

Aadavallu Meeku Joharlu : యంగ్ హీరో శర్వానంద్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. గతలాకొంత కాలంగా శర్వానంద్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. శర్వానంద్(sharwanand,) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఈ కుర్ర హీరో సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా  పోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా. ఇక రీసెంట్ గా రీలీజ్ అయిన మహా సముద్రం(Maha Samudram)పై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో శర్వానంద్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ ట్రాక్ ని విడుదల చేయడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్లు మొదలయ్యాయి ”హే లక్ష్మమ్మో పద్మమ్మో.. శాంతమ్మో శారదమ్మో.. గౌరమ్మో కృష్ణమ్మో.. నా పాటే వినవమ్మో..” అంటూ సాగినపాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో శర్వానంద్ వేసిన కొన్ని మాస్ డ్యాన్స్ లు ఆకట్టుకుంటున్నాయి.  ఇందులో ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపా రాజు – బెనార్జీ – కళ్యాణి నటరాజన్ – రాజశ్రీ నాయర్ – ఝాన్సీ – రజిత – సత్య కృష్ణ – ఆర్సిఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Bhanu Shree: లేహంగాలో అట్రాక్ట్ చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ