Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

గరుడ వేగ, కల్కి సినిమాల తర్వాత రాజశేఖర్(Dr Rajasekhar) హీరోగా నటిస్తోన్న చిత్రం 'శేఖర్'(Shekar). రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌(Jeevitha Rajasekhar) చాలా ఏళ్ల తర్వాత మరోసారి మెగా ఫోన్‌ పట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..
Rajasekhar Jeevitha
Follow us
Basha Shek

|

Updated on: Feb 04, 2022 | 10:23 PM

గరుడ వేగ, కల్కి సినిమాల తర్వాత రాజశేఖర్(Dr Rajasekhar) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘శేఖర్'(Shekar). రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌(Jeevitha Rajasekhar) చాలా ఏళ్ల తర్వాత మరోసారి మెగా ఫోన్‌ పట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. . బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తుండడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా శుక్రవారం (ఫిబ్రవరి4)న రాజశేఖర్‌ జన్మదినం సందర్భంగా ‘శేఖర్‌’ సినిమా లోని ‘కిన్నెర’ సాంగ్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కాగా ఇదే వేదికపై రాజశేఖర్ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.’ కొవిడ్ సమయంలో నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయిందని, మళ్లీ కెమెరా ముందుకు వస్తాననుకోలేదు. ఎందుకంటే కొవిడ్‌ సమయంలో నేను హాస్పిటల్లో కనీసం మంచంపై నుంచి లేవలేకపోయాను. అయితే ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నానంటే అది మీ అందరి ఆశీర్వాద బలమే. మీ ప్రేమాభిమానాలే నన్ను కరోనాను జయించేలా చేశాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత ‘శేఖర్’ సినిమాను చేశాను. 10 సినిమాలు చేసేందుకు ఎంత కష్టపడ్డానో ఈ ఒక్క సినిమా కోసం అంత కష్టపడ్డాను. యూనిట్‌ అంతా ప్రాణం పెట్టి ఈసినిమాకు పనిచేశాం. ఇక ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం జీవిత. తను మా వెనుకుండి నడిపించింది. దాని ఫలితం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.  అనంతరం దర్శకురాలు జీవిత రాజశేఖర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, రాజశేఖర్ కూతురు నటి శివానితో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడారు. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.