AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ

CPI Narayana: బిగ్ బాస్ షో(Bigg Boss Show) .. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు అక్కడ నుంచి దక్షిణాదిలోనూ అడుగు పెట్టింది. తెలుగులో బిగ్ బాస్ షో వివాదాల నడుమ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ తెలుగులో..

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ
Cpi Narayana
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 9:42 PM

Share

CPI Narayana: బిగ్ బాస్ షో(Bigg Boss Show) .. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు అక్కడ నుంచి దక్షిణాదిలోనూ అడుగు పెట్టింది. తెలుగులో బిగ్ బాస్ షో వివాదాల నడుమ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో సీజన్ కు రెడీ అవుతోంది. మరోవైపు బిగ్ బాస్ షో నిర్వహణ కరెక్ట్ కాదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది షో కాదు.. ఓ బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ ఈ సారి ఏకంగా హోస్ట్ గా చేసిన నాగార్జున పై సంచలన కామెంట్స్ చేశారు. తనకు నాగార్జున అంటే కోపం కాదని.. అసహ్యం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు ఆ షో లో ఏమి జరుగుతుంది.. ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. ఎవరితో డేటింగ్ చేస్తావు.. ఎవరిని కౌగిలించుకుంటావు,..ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ఇదే ఉంటుంది ఆ షోలో.. అసలు బిగ్ బాస్ షో అంటే ఇదేనా ఏమైనా ఉపయోగం ఉందా అంటూ నారాయణ మండిపడ్డారు.

తనకు ఓ కార్యక్రమలో శాలువా కప్పినప్పుడు పెట్టిన దండం ఫోటోలను కమ్యునిస్టులు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. అసలు కమ్యూనిస్టులు అంటే గడ్డం పెంచుకుని.. మాసిన బట్టలు..చిరిగిన చెప్పులు ధరించి ఉండాలా అంటూ ప్రశ్నించారు. అలా ఉండాలని ఎవరినా అనుకుంటే అది బ్రమే అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతోందన్నారు. సిఎం జగన్ చిన్న పిల్లవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ.

అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 వేదికగా ఓటీటీ మారనుంది. ఇప్పటికే నెక్స్ట్ సీజన్ ను ఓటీటీలో ప్రసారం చేయనున్నామని నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు.. ఈ షో ను ఓటీటీలో 24 గంటల పాటూ ప్రసారం చేయనున్నామని తెలిపారు. ఓ వైపు ఇప్పటికే ఈ షో లో అడుగు పెట్టే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హౌస్ లోకి రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, శ్రీహాన్ సహా మరికొందరు ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read:

 త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న శ్రీ ప్రియ కుమార్తె.. రెండు చోట్ల గ్రాండ్‌ వెడ్డింగ్‌..