AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sripriya Daughter: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న శ్రీ ప్రియ కుమార్తె.. రెండు చోట్ల గ్రాండ్‌ వెడ్డింగ్‌..

పురుషాధిపత్యమే ఎక్కువగా కనిపించే దర్శకత్వ విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీప్రియ (Sripriya).

Sripriya Daughter: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న శ్రీ ప్రియ కుమార్తె.. రెండు చోట్ల గ్రాండ్‌ వెడ్డింగ్‌..
Basha Shek
|

Updated on: Feb 04, 2022 | 9:22 PM

Share

పురుషాధిపత్యమే ఎక్కువగా కనిపించే దర్శకత్వ విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీప్రియ (Sripriya). తెలుగులో వెంకటేశ్‌, మీనాలతో కలిసి ‘దృశ్యం’ (Drishyam) లాంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించిన ఆమె కన్నడ, తమిళం భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించింది. మెగాఫోన్‌ చేపట్టక ముందు నటిగా కూడా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించింది. శివాజీ గణేశన్, శివ కుమార్, కమల్ హాసన్, రజినీ కాంత్ వంటి అగ్రహీరోల సరసన ఆమె స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం విశేషం. ఇక రాజ్ కుమార్ సేతుపేతితో కలిసి1988లో పెళ్లి పీటలెక్కారామె. ఈ దంపతులకు నాగార్జున, స్నేహా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజా విషయమేమిటంటే… శ్రీప్రియ కూతురు స్నేహ సేతుపతి (Sneha sethupathi) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. అన్మోల్ శర్మ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు నడవనుంది.

కాగా స్నేహ- అన్మోల్‌ల వివాహం అటు లండన్‌ లోనూ, ఇటు చెన్నైలోనూ రెండుచోట్ల జరగనుందని సమాచారం. మొదట ఫిబ్రవరి 6న లండన్‌ వేదికగా ఈ పెళ్లి జరగనుందని, ఆతర్వాత చెన్నైలో కూడా సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరపనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ కోసం ఏప్రిల్ 4, 5, 6 తేదీలను కూడా లాక్‌ చేశారని సమాచారం. ఈ వివాహానికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.

Also read:Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణం.. మత ప్రార్థనల పేరుతో మహిళలపై ఆకృత్యాలు.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు..

Kajal Aggarwal: అరుదైన గౌరవం అందుకున్న టాలీవుడ్‌ చందమామ.. సంతోషంగా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌..

Pushpa: పాలిటిక్స్‌కు పాకిన పుష్ప ఫీవర్‌.. శ్రీవల్లి ట్యూన్‌తో యూపీలో ఎన్నికల ప్రచారం..