Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..

బుల్లితెరపై బిగ్‏బాస్ (Bigg Boss ) రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లోనూ

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2022 | 10:27 AM

బుల్లితెరపై బిగ్‏బాస్ (Bigg Boss ) రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువగానే లభిస్తుంది. ఇప్పటికే హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళంలోనూ బిగ్‏బాస్ రియాల్టీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులో సీజన్ 5 ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ నాగార్జున.. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ సందడి ఉంటుందని ప్రకటించారు. దీంతో బిగ్‏బాస్ సీజన్ 6 ఆ అంటూ సందేహాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే బిగ్‏బాస్ సీజన్ 6 కాదని.. బిగ్‏బాస్ ఓటీటీ (Bigg Boss OTT) అని.. ఇకపై 24 గంటలు బిగ్‏బాస్ షోను వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ అయ్యిందని.. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా పాల్గొనబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్ రాజ్, అరియానా, అఖిల్ పాల్గోనబోతున్నారని సమాచారం. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో డీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, శ్రీహాన్ పాల్గోనబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అలాగే బిగ్‏బాస్ ఓటీటీ ఫిబ్రవరి 27న ప్రారంభం కాబోతుందని.. ఇందుకు సెలక్ట్ అయిన కంటెస్టెంట్స్ క్వారంటైన్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదల కానున్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Also Read: Mahesh Babu: బుర్జ్ ఖ‌లీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ పాటలు పాడుతున్న యంగ్ హీరో.. శర్వా సినిమా నుంచి సాంగ్..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Siri-Srihan: ఎట్టకేలకు రూమర్స్‏కు ఫుల్‏స్టాప్ పెట్టిన లవ్ బర్డ్స్.. యాంకర్ రవి ఫ్యామిలీతో సిరి, శ్రీహాన్ సందడి..