AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్ , వీడియోలు వాడితే కఠిన చర్యలు.. కోర్ట్ సీరియస్ వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్ , వీడియోలు వాడితే కఠిన చర్యలు.. కోర్ట్ సీరియస్ వార్నింగ్
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2025 | 4:46 PM

Share

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి 26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా, ప్ర‌ముఖ న‌టుడు కొణిదెల చిరంజీవికి అనుకూలంగా అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు) మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం పిటిషన్‌లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి/ఏ సంస్థైనా, చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌ తదితర గుర్తించదగిన లక్షణాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది.

నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలందుకున్న చిరంజీవి, తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలును అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు.

భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా, ఉన్నత వ్యక్తిత్వంగా చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ, పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేని విక్రయాలు మొదలైన చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించింది కోర్టు. ముఖ్యంగా డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది.

ఇవి కూడా చదవండి

ఈ నిషేధాజ్ఞ ప్రకారం ప్రతివాదులు 1 నుంచి 33 వరకు మరియు ప్రతివాది 36 (జాన్ డో)—ఎవరు అయినా సరే—చిరంజీవి గారి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), స్వరము, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించటం నుంచి వెంటనే నిరోధించబడుతున్నారు. అన్ని ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించగా తదుపరి విచారణను 27 అక్టోబర్ 2025కు నిలిపివేసింది.

వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు, TRPs పెంచడం, వీక్షణలను/లాభాలను పొందడం వంటి ఉదేశ్యాలతో, చిరంజీవి గారి పేరు, చిత్రం, స్వరము, లైక్నెస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా ప్రతిబింబించడం లేదా వక్రీకరించడం చేస్తే, చట్టం అనుమతించే కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని ఈ ఉత్తర్వు స్పష్టంగా హెచ్చరిస్తుంది. తద్వారా ఆయన ఖ్యాతి, మేధసంపత్తి రక్షణను పటిష్టంగా అమలు చేస్తుంది.

అక్టోబర్ 11న చిరంజీవి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్‌ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు ప్రక్రియ (criminal law machinery)ను ఈ సందర్భాల్లో సమర్థంగా అమలులోకి తేవడం విషయంపై వారి నిపుణ సలహాను కోరారు. ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు సవివరంగా చర్చించారు. చిరంజీవి గారి ఈ చట్టపరమైన చర్య, భారత వినోద రంగంలో వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ప్రాముఖ్యతను బలపరుస్తుందని సజ్జనార్ నొక్కిచెప్పారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి