AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.. ఆంజనేయ స్వామి దయతో కోలుకున్నాడు : చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న పవన్ విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లారు.

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.. ఆంజనేయ స్వామి దయతో కోలుకున్నాడు : చిరంజీవి
Chiranjeevi , Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2025 | 7:45 PM

Share

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. సింగపూర్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కాగా మార్క్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ వెళ్లారు. కాగా మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి అని తెలిసి మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్క్ శంకర్ ఆరోగ్యం పై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అప్డేట్ అందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు.

“మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే  వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ  సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ చిరంజీవి మార్క్ శంకర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి. కాగా మార్క్ శంకర్‌కి సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్ళిన పవన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి శంకర్‌ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు అయ్యాయని…పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఎమర్జెన్సీ వార్డులు చికిత్స అందించారన్నారు. మార్క్ కోలుకొంటున్నాడని, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు నుంచి మరో రూంకి షిఫ్ట్‌ చేశారన్నారు పవన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?