AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్. ఇప్పుడు బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి
Ntr Movie
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2025 | 1:48 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మాయమవుతుంటారు. చేసింది కొన్ని సినిమాలే అయినా తమ మార్క్ ను వదిలి వెళ్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది ప్రేక్షకులు దాదాపు మర్చిపోయి ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? ఎన్టీఆర్ తో కలిసి నటించింది ఈ భామ. ఎన్టీఆర్ కెరీర్ లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో శక్తి సినిమా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. శక్తి సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఎన్టీఆర్ భార్యగా కనిపించింది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు ఆమె పేరు మంజరి ఫెడ్నస్.

అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రేం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత మరోసారి అల్లరి నరేష్ తో కలిసి శుభ ప్రదం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. కళాతపస్వి కే విశ్వనాద్ తెరకెక్కించిన చివరి సినిమా ఇది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మంజరి తన నటనతో అలరించింది.

ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో కనిపించింది మంజరి. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే టాలీవుడ్ లో పాగా వేసేదే ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరాఠి , హిందీ సినిమాలతో బిజీగా మారిపోయింది ఈచిన్నది. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందా.? అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంజరి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది. సడన్ గా చూస్తే గుర్తు పట్టడం కష్టమే.. అమ్మబాబోయ్ అందాలతో మతిపోగొడుతోంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్