- Telugu News Photo Gallery Cinema photos Bollywood heroines like Janhvi Kapoor, Alia Bhatt, Deepika Padukone wants more screen time in hollywood movies
బాలీవుడ్ టూ టాలీవుడ్.. కాస్త టైమ్ కావాలంటున్న హాట్ బ్యూటీస్
ప్రజెంట్ ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. మన హీరోలు, మన దర్శకులు, మన హీరోయిన్లే నార్త్‌లోనూ సత్తాచాటుతున్నారు. అందుకే నార్త్ బ్యూటీస్ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ సౌత్ జర్నీ బాలీవుడ్ బ్యూటీస్ ప్రూవ్ చేసుకునేంత స్క్రీన్ టైమ్ దక్కటం లేదు.
Updated on: Apr 10, 2025 | 7:52 PM

ప్రజెంట్ ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. మన హీరోలు, మన దర్శకులు, మన హీరోయిన్లే నార్త్‌లోనూ సత్తాచాటుతున్నారు. అందుకే నార్త్ బ్యూటీస్ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ సౌత్ జర్నీ బాలీవుడ్ బ్యూటీస్ ప్రూవ్ చేసుకునేంత స్క్రీన్ టైమ్ దక్కటం లేదు.

అందుకే అప్ కమింగ్ సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు బీటౌన్ హీరోయిన్స్. బాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు పోటి పడుతున్న దీపిక, ఆలియా భట్ లాంటి తారలు సౌత్‌తో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు.

ఆల్రెడీ సౌత్ ఎంట్రీ ఇచ్చినా ఈ బ్యూటీస్... పెద్దగా స్క్రీన్ టైమ్ దక్కకపోవటంతో అప్ కమింగ్ సినిమాలతో అయినా సౌత్ ఇండస్ట్రీలో జెండా పాతాలని కష్టపడుతున్నారు. దేవర లాంటి కమర్షియల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కి కూడా కావల్సినంత స్క్రీన్ టైమ్ దక్కలేదు.

నార్త్ ఇమేజ్‌కు భిన్నంగా ఇక్కడ గ్లామర్ షో చేసినా... జూనియర్ శ్రీదేవికి సౌత్ ఆడియన్స్ ముందు ప్రూవ్ చేసుకునే అంత టైమ్ మాత్రం దొరకలేదు. అందుకే దేవర 2లో తన మార్క్ చూపించేందుకు ఎదురుచూస్తున్నారు జాన్వీ.

తెలుగులో మూడు సినిమాలు చేసిన కృతి సనన్, సాహోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌ను టాలీవుడ్ ఆడియన్స్ అసలు గుర్తించనే లేదు. టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్న కియారా అద్వాని కూడా కమర్షియల్ సినిమాల్లోనే కనిపిస్తుండటంతో పెద్దగా పేరు రావటం లేదు. అందుకే ఈ బ్యూటీస్ అంతా నెక్ట్స్ ఛాన్స్ వస్తే తెలుగు మార్కెట్‌లో తామేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.