AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చాలా మంది హీరోయిన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. కొందరు సీరియస్ అవుతారు కానీ కొందరు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు. అలాగే ఓ సింగర్ కూడా తన పై వచ్చే ట్రోల్స్ పై స్పందించింది. నా బాడీ, నా బట్టలు, నా ఇష్టం అంటూ కామెంట్స్ చేసింది.

నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్
Singer
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2025 | 10:43 AM

Share

సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో .. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ సింగర్ కూడా తన డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది. అంతే కాదు ఆ ట్రోల్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఇంతకూ ఆ సింగర్ ఎవరో తెలుసా..? ఆమె రూపమే కాదు.. ఆమె గొంతు కూడా అందమే.. తన మదురమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించింది. అందంలో హీరోయిన్స్ తో పోటీపడుతుంది ఈ ముద్దుగుమ్మ. తన పై వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోనూ అంటుంది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ దామిని భట్ల. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సాంగ్ తోనే ఫెమ్స్ అయ్యింది దామిని భట్ల.

సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించిన దామిని.. అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుని దామిని. పాడుతా తీయగా, సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని.. సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆతర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. 2014లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టింది ఈ చిన్నది. లవ్ ఇన్ లండన్, బాహుబలి ది బిగినింగ్, మనసంతా ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.గతంలో ఓ ఇంటర్వ్యూలో దామిని మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ లో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది. వీటితో పాటు తన పై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది. నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను. నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. పాజిటివిటీని నెగిటివ్ గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉంటారు అలాంటివాటిని, అలంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చిది దామిని.

View this post on Instagram

A post shared by Damini (@daminibhatlach)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us