Tollywood : 15 ఏళ్లకే ఇంట్లో నుంచి పారిపోయి.. ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్..
సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్స్ చిన్ననాటి జ్ఞాపకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 15 ఏళ్లకే ఇంట్లో నుంచి పారిపోయింది. సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడింది. చివరకు సినీరంగంలో చక్రం తిప్పింది. ఇంతకీ ఆమె ఎవరంటే.

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఫైర్ బ్రాండ్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో స్క్రిన్ షేర్ చేసుకుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటుతుంది. అంతేకాదు.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ముక్కు సూటిగా మాట్లాడుతూ ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో చిత్రనిర్మాతలు, సహచరులు, బంధుప్రీతి గురించి అనేక కామెంట్స్ చేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈ హీరోయిన్ కాస్త దర్శకురాలిగా, ఆ తర్వాత నిర్మాతగా మారింది. ఇంతకీ ఈ అందమైన అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ కంగనా రనౌత్.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం కంగనా రనౌత్ చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఈ అమ్మాయి.. 15 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి ముంబై చేరుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం స్టూడియోస్ చుట్టూ తిరిగింది. కంగన హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో జన్మించింది. కంగన తల్లి ఆశా రనౌత్ పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి అమర్ దీప్ రనౌత్ ఒక వ్యాపారవేత్త. ఆమె అక్క రంగోలి చందేల్ కంగన మేనేజర్ గా పనిచేస్తున్నారు. హిందీలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే స్టార్ హీరోస్, దర్శకురాలపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఇటీవలే తనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందించిన తలైవి సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో జయలలిత పాత్రను పోషించడానికి కంగనా ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. సినిమాలు, రాజకీయాలతోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కంగనా.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..




