AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. 42 ఏళ్ల వయసులోనూ ఇంతందంగా..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ వయ్యారి.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood : 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. 42 ఏళ్ల వయసులోనూ ఇంతందంగా..
Trisha
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2025 | 3:16 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తన తండ్రితో కలిసి కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. ? సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అంతేకాదు.. ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తుంది. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ త్రిష. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన త్రిష.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో త్రిష జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. వర్షం సినిమా తర్వాత దక్షిణాదిలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మోహన్ లాల్, అజిత్, సూర్య, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినీరంగంలోకి త్రిష అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

ఆమె చెన్నైలో పాలక్కాడ్‌కు చెందిన తమిళ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కృష్ణన్ అయ్యర్, ఆమె తల్లి ఉమా అయ్యర్. త్రిష తన పాఠశాల, కళాశాల విద్య మొత్తాన్ని చెన్నైలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె మోడలింగ్, ప్రకటనల ద్వారా పరిశ్రమలోకి ప్రవేశించింది. త్రిష కృష్ణన్ 1999లో మిస్ స్లామ్ అందాల పోటీని గెలుచుకుంది. అదే సంవత్సరం మిస్ చెన్నై పోటీలో కూడా ఆమె గెలిచింది. 2001లో, మిస్ ఇండియా పోటీలో త్రిషకు మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ బిరుదు లభించింది.

త్రిష కృష్ణన్ కల నటి కావడం కాదు, క్రిమినల్ సైకాలజిస్ట్ కావడమే ఆమె కోరిక. ఆ తర్వాత నెమ్మదిగా నటనవైపు ఆసక్తి ఏర్పడింది. 2000లో, త్రిష ఫల్గుణి పాఠక్ సంగీత ఆల్బమ్‌లో కనిపించింది. “మేరీ చూనర్ ఉద్ ఉద్ జాయే” పాటలో త్రిష కృష్ణన్ కనిపించింది. 2002లో మౌనం పెసియాదే అనే చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

Follow Us