AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Automobile: కారులో వెళ్లేటప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నారా..? ఇవి మర్చిపోతే మీకు ఇబ్బందులే..

ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ అవసరాల కోసం మధ్యతరగతి ప్రజలు కూడా కార్లను వినియోగిస్తున్నారు. దేశంలో కార్ల వినియోగం అనేది రోజురోజుకు పెరిగిపోతోంది. దూరపు ప్రయాణాలు చేయాలంటే కారులో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు తక్కువ ధరల్లో కూడా కార్లు లభిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి జనం కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు.

Automobile: కారులో వెళ్లేటప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నారా..? ఇవి మర్చిపోతే మీకు ఇబ్బందులే..
Car Ac
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 3:49 PM

Share

ప్రస్తుతం కారు మధ్యతరగతి ప్రజల ఇళ్లల్లో కూడా కనిపిస్తుంది. బ్యాంకులు కూడా వెహికల్ లోన్స్ సులువుగా మంజూరు చేస్తున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఇన్‌స్టంట్‌గా వెహికల్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. దీంతో ఎక్కువమంది వెహికల్ లోన్ తీసుకుని కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు మెయింటనెన్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పెట్రోల్, డీజిల్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇక ఏసీ ఆన్ చేసుకుంటే పెట్రోల్, డీజిల్ ఖర్చు మరింత పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీ వేస్తే ఖర్చు పెరుగుతుందా..?

వేసవి కాలం కావడంతో కారులో వెళ్లేవారు ఏసీని ఎక్కువగా వాడుతుంటారు. కారు ఏసీ ఇంజిన్‌పై అదనపు భారాన్ని మోపుతుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. హైవేపై వెళ్లేటప్పుడు కిటికీలు తెరిచి డ్రైవింగ్ చేయడం కంటే ఏసీ ఆన్ చేసి నడపడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కారులో ఏసీ నడుస్తున్నప్పుడు ఇంజిన్ కంప్రెసర్ నుంచి శక్తిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇంజిన్‌పై భారం పడి ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇంధన సామర్థ్యాన్ని ఏసీ 10 శాతం వరకు తగ్గిస్తుంది. అయితే చాలామంది కారులో వెళుతున్నప్పుడు పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేసుకునేందుకు ఏసీని ఆపి కిటికీలు తెరుస్తారు. గంటకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు అలా చేయడం హానికరమని నిపుణులు అంటున్నారు. కిటికీలు పెరగడం వల్ల గాలి పీడనం పెరిగి ఇంజిన్ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల హైవేపై వెళ్లేటప్పుడు ఏసీని ఉపయోగించడం ప్రయోజకరంగా ఉంటుంది.

ఆగి ఉన్న కారులో ఏసీని నడిపితే..?

ఆగి ఉన్న కారులో ఏసీని నడపడం వల్ల మరింత నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంజిన్‌తో పాటు ఏసీ నడవడం వల్లన పెట్రోల్, డిజిల్ మరింత వినియోగించుకుంటోంది. కారు ఆగి ఉన్నప్పుడు గంటకు ఒక లీటర్ ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. దీంతో కారు ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా ఆగి ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఇంజిన్ నడుస్తూ ఉండటం వల్ల ఇంధనం ఖర్చు పెరుగుతుంది. మీరు కారులో వెళ్లేటప్పుడు ఇంధనం ఆదా చేసుకోవాలంటే.. కారులోకి ఎక్కిన తర్వాత రెండు నిమిషాల పాటు కిటికీలు తెరిచి ఉంచడం వల్ల వేడి గాలి బయటకు పోతుంది. దీని వల్ల ఏసీపై భారం తగ్గుతుంది. ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బ్లోయర్ ఫ్యాన్‌ను మాత్రమే ఉపయోగించండి.

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!