Tollywood : ప్రభాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్.. పాపులర్ నటుడి భార్య.. కట్ చేస్తే.. ఇప్పుడు బుల్లితెరపై మహారాణి..
ప్రస్తుతం ఓ నాట్యమయూరి చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పట్లో నటిగా వెండితెరపై సందడి చేసిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై మహారాణిగా చక్రం తిప్పుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించింది. ఇప్పుడు నటనకు దూరంగా ఉంటూ యాంకర్ గా కొనసాగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా... ?

పైన ఫోటోలో కనిపిస్తున్న నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా.. ? కేరళకు చెందిన ఈ అమ్మడు.. మొదట తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. అదే సమయంలో బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఇప్పుడు మాత్రం నటనకు దూరంగా ఉంటూ స్మాల్ స్క్రిన్ పై యాంకరింగ్ లో దుమ్మురేపుతుంది. ఆమె వాక్చాతుర్యం, కామెడీ పంచులకు అడియన్స్ ఫిదా అవుతుంటారు. ప్రతి సినిమా ఈవెంట్ అంటే కచ్చితంగా ఆమె ఉండాల్సిందే. అంతగా తన మాటల గారడితో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు మరెవరో కాదండి.. యాంకర్ సుమ. చిన్నప్పుడే ఆమె శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఆమె తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు దశాబ్దన్నర కాలంగా బుల్లితెరపై యాంకర్ గా పనిచేస్తున్నారు. సుమ హోస్ట్ గా లేకుండా ఏ కార్యక్రమం, ఏ సినిమా ఈవెంట్ జరగదంటే అతిశయోక్తి కాదు.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
సుమ స్వస్థలం కేరళ. చిన్నప్పటి నుంచే నటన, సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. ప్రస్తుతం యాంకర్ గా దూసుకుపోతున్న సుమ.. ఒకప్పుడు హీరోయిన్ అన్న సంగతి తెలుసా.. ? ఆమె 1996లో కళ్యాణ ప్రాప్తి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె మెయిన్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో కనిపించింది. పవిత్ర ప్రేమ, వెరీ గుడ్, పండండి కాపురం వంటి వరుస చిత్రాలలో ఆమె నటించింది. అయితే ప్రభాస్ నటించిన వర్షం చిత్రం సుమకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె ప్రభాస్ అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత ఆమె కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకంలో న్యూస్ రిపోర్టర్‌గా నటించింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్ చేసింది సుమ. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నటుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా యాక్టింగ్ మానేసిన సుమ.. యాంకర్ గా సెటిల్ అయ్యింది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇప్పుడు బుల్లితెరపై ఆమె తిరుగులేని యాంకర్. చాలా కాలం తర్వాత ఆమె 2022లో జయమ్మ పంచాయితీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. విజయ్ కుమార్ కలివర్పు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..




