Megastar Chiranjeevi: మెగాస్టార్ జోడిగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇది అస్సలు ఊహించలేదుగా..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు చిరు మరిన్ని కథలు వింటున్నట్లుగా సమాచారం. తాజాగా ఆయన కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో హిట్టు కొట్టిన చిరు.. ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ నటించనున్నట్లు సమాచారం. 90ల నాటి హిందీ హీరోయిన్ల విషయానికి వస్తే, కరిష్మా కపూర్, కాజల్, ఐశ్వర్య రాయ్, రవీనా టాండన్, శిల్పా శెట్టి, ఊర్మిళా మటోండ్కర్ వంటి పేర్లు వెంటనే గుర్తుకు వస్తాయి. కానీ అప్పట్లో మరో హీరోయిన్ సైతం ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. తనే రాణీ ముఖర్జీ. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్. ‘గులాం’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హలో బ్రదర్’, ‘చోరి చోరి చుప్కే చుప్కే’ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన రాణి ముఖర్జీ ఇప్పుడు తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె కనిపించనుందట. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోయే సినిమాలో రాణి ముఖర్జీ నటించనున్నట్లు సమాచారం. రాణి ముఖర్జీ గతంలో 2000 లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘హే రామ్’ లో నటించింది. రాణి ముఖర్జీ నటించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘హే రామ్’. ఆ తర్వాత, ఇది రాణికి రెండవ దక్షిణ భారత చిత్రం అవుతుంది. రాణి ముఖర్జీ ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. 2014 లో వివాహం చేసుకున్న తర్వాత, రాణి ముఖర్జీ సినిమాల్లో నటించకుండా విరామం తీసుకుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




