Anasuya: మేనేజర్‌ను తొలగించిన అనసూయ.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా తన అందం, అభినయంతో యూత్‌లో మంచి క్రేజ్ సొతం చేసుకుంది. నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అనసూయ భరద్వాజ్.. ఈ అమ్మడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు జబర్దస్త్‌తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనసూయ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనూ రాణిస్తుంది. రంగస్థలం సినిమా అనసూయ డిమాండ్ పెంచేసింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోరు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన సినిమాలు, షోల అప్డేట్స్ తో పాటు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.
ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తన మేనేజర్ ను తొలగిస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. తనకి మేనేజర్‌గా పనిచేసిన మహేంద్ర.. రిలీవ్ అయ్యారంటూ.. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని పంచుకుంది.
ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
నాకు మేనేజర్‌గా పనిచేసిన మిస్టర్ మహేంద్ర.. సుదీర్ఘ ప్రయాణం.. వృత్తిపరమైన ప్రయాణం తరువాత ఆయన రిలీవ్ అవుతున్నారు. ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో నేను ఎంతో నేర్చుకున్నా.. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్‌గా ఆయన చేసిన సహాయం, కృషి, చూపిన నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కూడా కొందరు నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రిలీవ్ అని అంటారెందుకు మేడమ్.. రిలీవ్ చేశానని ఈమె అనుకుంటుంది.. రిజైన్ చేసి ఈ గోల నుంచి తప్పించుకున్నానని ఈమె మేనేజర్ ఆనందపడతాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది తెలివైనవాడు బ్రతికిపోయాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








